భారత్-శ్రీలంక జట్ల మధ్య రేపు జరగనున్న తొలి టెస్ట్‌కు… ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. టీమిండియాలోని విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలకు ఈ మ్యాచ్ మైలురాయి కానుంది. 100వ టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఒకరైతే.. సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్ బాధ్యతలు చేపడుతున్న రోహిత్ శర్మ మరొకరు. మొహాలీ టెస్ట్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని కోహ్లీ, రోహిత్ భావిస్తున్నారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ గెలుపొందిన భారత్…ఆ తర్వాత లంకతో మూడు టీ20ల సిరీస్‌ను వైట్…
టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన ఆటగాడిగా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ ఫార్మాట్లో రోహిత్ 45 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (44) చెత్త రికార్డును రోహిత్ క్రాస్ చేశాడు. అలాగే…
ధర్శశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.. శ్రీలంకను వైట్‌వాష్ చేసి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది రోహిత్ సే.. ఇక, ఈ మ్యాచ్‌తో మరో రికార్డు నెలకొల్పాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 కేరిర్‌లో 125 మ్యాచ్‌లు పూర్తి చేశాడు.. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.. ఇప్పటి వరకు ఈ రికార్డు…
భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక, ఈ విజయంతో.. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.. స్వదేశంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు.. ఇప్పటివరకు భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్ సొంతగడ్డపై 15 సార్లు జట్టుకు విజయాలను అందించాడు.. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ విజయం రోహిత్‌కు…
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోరును చేరుకోవడంతో న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్‌ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 3,307 పరుగులతో అగ్రస్థానలో కొనసాగుతున్నాడు. గప్తిల్ (3,299 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (3,296 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో…
ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్.. గురువారం నుంచి శ్రీలంకతో తలపడనుంది. అనంతరం ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిశాక కూడా టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అర్ధంతరంగా రద్దయిన టెస్టును…
కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ (65), వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్) మంచి స్కోరు అందించారు. దీంతో 20 ఓవర్లలో భారత్ 184/5 స్కోరు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 167/9 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి భారత…
టీమిండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మనే కెప్టెన్. గతంలో రోహిత్ టెస్టుల్లో పనికిరాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలను తట్టుకుని ఏకంగా టెస్టు జట్టుకే నాయకత్వం వహించే స్థాయికి రోహిత్ ఎదిగాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం రోహిత్ శర్మ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018 సెప్టెంబర్ 1న రోహిత్ అభిమానులతో #AskRohit నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానమిస్తూ.. ‘నన్ను…
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈరోజు జరిగే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరు మీద…
సారథిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌లో వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. తన తొలి వన్డే సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు 13 వన్డేలకు కెప్టెన్సీ వహించగా 11 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఇండియా తరఫున కోహ్లీ నెలకొల్పిన…