Rohit Sharma: హిట్ మ్యాన్ కెరీర్‌కు 15 ఏళ్లు పూర్తి.. రోహిత్ ఎమోషనల్ లెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి నేటితో 15 ఏళ్లు పూర్తవుతోంది. 2007, జూన్ 23న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున రోహిత్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రోహిత్ శర్మ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తనకు ఇష్టమైన జెర్సీలో ఈ జర్నీని పూర్తి చేసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. ఇది ఎంతో గొప్ప ప్రయాణంగా అభివర్ణించాడు. తన ఇన్నేళ్ల క్రికెట్ జర్నీలో భాగమైన క్రికెట్ ప్రేమికులు, విమర్శకులు, అభిమానులు.. ఇలా ప్రతి ఒక్కరికీ రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన జీవితాంతం క్రికెట్‌ను ఆదరిస్తానని పేర్కొన్నాడు. భారత క్రికెటర్ల పట్ల అభిమానులు చూపుతున్న ప్రేమాభినాలు టీమిండియాను ఈ స్థాయిలో ఉంచాయని రోహిత్ అన్నాడు.
కాగా రోహిత్ శర్మ ఇప్పటివరకు తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 230 వన్డేలు, 125 టీ20లు, 45 టెస్టులు ఆడాడు. టీమిండియా తరపున అన్ని ఫార్మాట్‌లలో కలిపి 15,733 పరుగులు చేశాడు. టెస్టుల్లో 8 సెంచరీలు, వన్డేల్లో 29 సెంచరీలు, టీ20ల్లో 4 సెంచరీలు రోహిత్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు జట్టు మేనేజ్‌మెంట్ అప్పగించింది. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టులో భారత్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జులై 1వ తేదీన ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
Also Read
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
𝟭𝟱 𝘆𝗲𝗮𝗿𝘀 in my favourite jersey 👕 pic.twitter.com/ctT3ZJzbPc
— Rohit Sharma (@ImRo45) June 23, 2022
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!