Rohit Sharma Backs Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు రెండు వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. రెండింటిలోనూ అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అతడ్ని ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కి పంపించాడు. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో సూర్యని పక్కనపెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు సైతం సూర్యని తొలగించి, అతని స్థానంలో సంజూ శాంసన్‌ని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతనికి మద్దతుగా నిలిచాడు. ఒకట్రెండు మ్యాచ్‌లతో ఒక ఆటగాడి సామర్థ్యాన్ని అంచనా వేయలేమని, సూర్య తప్పకుండా వన్డేల్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Kunamneni Sambasiva Rao : కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు కోసం ప్రజా పోరు యాత్ర
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘జట్టులోకి శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు తిరిగొస్తాడో తెలీదు. అప్పటివరకు అతని స్థానంలో సూర్య కొనసాగుతాడు. ఒకట్రెండు మ్యాచ్‌లతో ఓ ఆటగాడి సామర్థ్యాన్ని అంచనా వేయడం కరెక్ట్ కాదు.సూర్య ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో అతడో అద్భుతమైన ఆటగాడు. వన్డే ఫార్మాట్‌లో అతడు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. తన లోపాలను సరిదిద్దుకుని, రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నా. అతడు ఈ రెండు మ్యాచెస్‌లోనే కాదు, గత వన్డే సిరీస్‌లలోనూ పెద్ద రాణించలేదన్న విషయం తెలుసు. కానీ సూర్య లాంటి ఆటగాడికి జట్టు మెనెజ్‌మెంట్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుంది. మరో 7-8 మ్యాచ్‌లు ఆడితే, వన్డేల్లోనూ సూర్య సౌకర్యవంతంగా ఉంటాడు. అతడు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
Salman Khan: పూజా హెగ్డే ప్రేమలో పడుతున్న భాయ్ జాన్
ఇదిలావుండగా.. ఈ వన్డే సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా, ఇరు జట్లు చెరో విజయం సాధించాయి. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. దీంతో.. ఈ వన్డే సిరీస్ 1-1 తో సమం అయ్యింది. మూడో వన్డే మ్యాచ్ మార్చి 22వ తేదీన చెన్నై వేదికగా జరగనుంది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో, వారిదే ఈ సిరీస్. మరి, భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందో లేదో చూడాలి.