బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1 విజయం సాధించిన తర్వాత, భారత్- ఆస్ట్రేలియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచుల ODI సిరీస్‌పై దృష్టి సారించింది. రోహిత్ శర్మ తొలి వన్డే నుంచి తప్పుకోవడంతో జట్టును నడిపించే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. రోహిత్‌తో పాటు, శ్రేయాస్ అయ్యర్ కూడా మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కు దూరంగా ఉన్నాడు, అయినప్పటికీ అతని స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.
Also Read:Secunderabad: స్వప్నలోక్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా..
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి పోరు జరుగుతోంది. ‘కెప్టెన్’ హార్దిక్ పాండ్యా తొలిసారి వన్డేలో సారథ్యం వహించడంపై అందరి దృష్టి ఉంది. తొలి గేమ్‌కు రోహిత్ శర్మ జట్టులో లేకపోవడంతో, శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. మధ్యలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలను అందుకోవడంతో క్రికెట్ అభిమానులు మ్యాచ్ కోసం ఎంతో అసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తొలి వన్డేలో భారత్ గెలిస్తే కెప్టెన్‌గా హార్దిక్ పేరు మారుమోగుతుంది. సహచర ఆటగాళ్లను హార్దిక్ బాగా ప్రోత్సహిస్తున్నాడట.
Also Read:TCS CEO: టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ రాజీనామా.. సంస్థలో అనూహ్య మార్పు
తొలి వన్డే నేపథ్యంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని అన్నారు. టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ కెప్టెన్సీకి తాను ఫిదా అయ్యా అని చెప్పారు. గుజరాత్ టైటాన్స్, భారత జట్టును అద్భుతంగా నడిపించాడని తెలిపారు. ఆస్ట్రేలియాతో ముంబైలో జరిగే తొలి వన్డేలో భారత్ విజయం సాధిస్తే.. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం భారత కెప్టెన్‌గా హార్దిక్ పేరు బలంగా వినిపించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.