Ajit Agarkar: భారత క్రికెట్లో ఒక శకం ముగిసి.. మరో కొత్త శకానికి తెర లేపినట్లుగా బీసీసీఐ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అది ఏదో కాదు.. శుభ్‌మన్ గిల్ ఇకపై భారత వన్డే జట్టుకు నూతన కెప్టెన్ గా చేయడమే. దేశానికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ఉన్నప్పటికీ.. 38 ఏళ్ల రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంతో 26 ఏళ్ల గిల్ ఇప్పుడు…
యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఇక అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 19 నుంచి టీ20 సిరీస్, అక్టోబర్ 29 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే వన్డే సిరీస్‌కు తమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం…
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆసియా కప్ 2025 నేటి నుంచే ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నమెంట్.. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో మొదలవనుంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆసియా జట్లు సిద్ధం కావడానికి ఆసియా కప్‌ను పొట్టి ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.…
Rohit Sharma spotted at Hospital in Mumbai: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య యూఏఈతో బుధవారం తలపడేందుకు భారత జట్టు సిద్ధమవుతుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసుపత్రికి వెళ్లాడు. సోమవారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. రోహిత్ ఆసుపత్రిలోకి ప్రవేశించే సమయంలో రిపోటర్స్ ఫోటోగ్రాఫర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
ప్రస్తుతం క్రికెట్ ఆడకున్నా.. టీమిండియా కెప్టెన్ ‘రోహిత్ శర్మ’ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. రిటైర్మెంట్ సంగతి అటుంచితే.. అత్యంత కఠినమైందిగా నిపుణులు పేర్కొన్న ‘బ్రాంకో’ ఫిట్నెస్ టెస్టులో పాస్ అవుతాడా? అని మాజీలతో సహా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న హిట్‌మ్యాన్ ఫిట్నెస్ టెస్ట్ మీద అందరూ దృష్టిసారించడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురిచేసేదే. అయితే అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ.. రోహిత్ బ్రాంకో టెస్టులో పాసయ్యాడు. ఇక తన…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని చూస్తున్నాడు. ఎందుకంటే.. వన్డే ప్రపంచకప్ రోహిత్ కల అని తెలిసిందే. టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు పూర్తిగా వన్డేలపై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే రోహిత్‌ను టీమ్ నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు.…
Rohit Sharma To Play for India A against Australia A: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 అనంతరం హిట్‌మ్యాన్ ఒక్క మ్యాచ్ ఆడలేదు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో ఆడాల్సి ఉండగా.. సిరీస్ రద్దయింది. ఇక ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నాడు. అయితే అంతకుముందే హిట్‌మ్యాన్ మ్యాచ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ముందు భారత్-ఎ…
టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు.. వన్డేలకూ గుడ్‌బై చెప్పేశారా? అని అభిమానులు అయోమయానికి గురయ్యారు. హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? అని బుధవారం అభిమానులు కాసేపు జోరుగా చర్చలు జరిపారు. ఇందుకు కారణం ఐసీసీ. ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ పేర్లు కనిపించకపోవడమే ఇందుకు కారణం. సాంకేతిక కారణాల వల్లే ఇద్దరి పేర్లు ర్యాంకింగ్స్ జాబితాలో కనిపించలేదని ఐసీసీ తర్వాత ప్రకటించింది. కాసేపటికి…