Virat Kohli & Rohit Sharma’s ODI future and the 2027 World Cup టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్ వాయిదా పడడంతో ఇద్దరు మైదానంలోకి దిగడానికి మరిన్ని రోజుల సమయం పట్టనుంది. ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌లు ఆడనున్నారు. అయితే ఇంగ్లండ్‌పై కుర్రాళ్లు ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేయడం ఈ…
మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ.. గ్యాలరీ నుంచి నాకు రోహిత్ శర్మ ఒక మేసేజ్ కూడా పంపించాడని పేర్కొన్నాడు. అందుకే, ఈ మ్యాచ్ లో శతకం కొట్టాను అని తెలిపాడు.
Rohit Sharma Attends ENG vs IND 5th Test at The Oval ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్‌కు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. మూడో రోజైన శనివారం ఆటను చూసేందుకు రోహిత్ ఓవల్ మైదానానికి వచ్చాడు. ఈరోజు ఆట ఆరంభమైన గంట తర్వాత హిట్‌మ్యాన్ స్టేడియంలోకి వచ్చాడు. వీఐపీ గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఇందుకు…
ఓ క్రీడా జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ భారత వన్డే జట్టుకు వచ్చే సిరీస్ నుంచే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని అందులో రాసుకొచ్చాడు. ఇప్పటికే టెస్ట్‌లలో టీమిండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీకి కూడా అందుకోనున్నాడా? అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), బీసీసీఐ సంయక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను తరువాత విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026లో నిర్వహించేందుకు బీసీబీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక హింసాత్మక…
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ మ్యాచ్‌లు సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే వన్డే మరియు టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పుడు దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.అసలు ఈ సిరీస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దానికి కారణం అక్కడి పరిస్థితులే. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో 3 వన్డేలు మరియు 3 టీ20లు ఆడనుంది. అయితే భారత ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ట్రోఫీ గెలవడంతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకపాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అద్భుత బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా తన టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను వరుణ్ ఎంచుకున్నాడు. అయితే అతడి జట్టులో టీమిండియా…
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏవేవో ఆలోచనలతో తన కాళ్లు, చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని చెప్పాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ పోతుందనుకున్నా అని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడని ప్రశంసించాడు. కీలక సమయంలో రిషబ్ పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా అని, అయితే బ్యాటర్ల లయను…
ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతడి భార్య గీతా బాస్రా హోస్ట్ చేసిన ‘హూ ఈజ్ ది బాస్ వైటీ’ అనే టాక్ షోలో రోహిత్ సతీసమేతంగా పాల్గొన్నాడు. భారత వన్డే కెప్టెన్ రోహిత్ ఈ షోలో పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్టీ20) మ్యాచ్ సందర్భంగా తాను టాస్ గెలిచి…
తన సతీమణి రితిక సజ్‌దేశ్‌కు చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసినట్లు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను క్రికెట్ ప్రారంభించిన ప్రాంతానికి రితికను తీసుకెళ్లి.. పిచ్‌పై మోకాలిపై కూర్చొని తన ప్రేమను తెలియజేసినట్లు చెప్పాడు. ఆ క్షణాలను కెమెరాలో బంధించామని, రితికనే తన అదృష్ట దేవత అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతడి…