టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్, కోహ్లీల భవితవ్యంపై చర్చలు జరిగాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఇద్దరు చోటు దక్కించుకున్నా.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడడం అనుమానమే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు…
Rohith Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఆటోమొబైల్ రంగంపై ఉన్న అభిరుచిని చాటుకున్నాడు. తాజాగా రోహిత్ సరికొత్త టెస్లా మోడల్ Y (Tesla Model Y) కారును కొనుగోలు చేశాడు. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ వాహనం లాంచ్ అయిన తర్వాత సొంతం చేసుకున్న తొలి వ్యక్తుల్లో రోహిత్ శర్మ కూడా ఒకరు. ఆటోమొబైల్ ప్రియుడిగా పేరుగాంచిన రోహిత్, ఇటీవలే లాంబోర్ఘిని ఊరస్ SE (Lamborghini Urus SE)…
శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అక్టోబర్ 4న గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హిట్‌మ్యాన్ ఫాన్స్ అయితే బీసీసీఐపై మండిపడ్డారు. తాజాగా రోహిత్ తన వన్డే కెప్టెన్సీ వేటుపై స్పందించాడు. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు…
వన్డే, టీ20 సిరీస్‌ల కోసం త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్, అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ ఆడనున్న సిరీస్ ఇదే. దాదాపు 7 నెలల తర్వాత హిట్‌మ్యాన్ జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ వన్డే పగ్గాలు అప్పగించడంతో.. రోహిత్ ఆటగాడిగా మాత్రమే…
మంగళవారం ముంబైలో జరిగిన 27వ ఎడిషన్ సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందుకు కారణం.. ఎవరూ ఊహించని రీతిలో హిట్‌మ్యాన్ బరువు తగ్గడమే. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడంను లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో 95 కేజీల నుంచి 75 కిలోలకు బరువు తగ్గాడు. 20 కేజీల బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు యువ క్రికెటర్లకే పోటీనిచ్చేలా ఉన్నాడు.…
2027 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడడం డౌటే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీకి చాలా సమయం ఉందని.. అప్పటివరకు ఇద్దరు తమ ఫామ్, ఫిట్నెస్ను ఎలా కాపాడుకుంటారో చూడాలన్నాడు. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంతో కోహ్లీ, రోహిత్‌లను జట్టు నుంచి పక్కన పెట్టేసినట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడమే అని ఏబీడీ పేర్కొన్నాడు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం…
Team India: టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడించాలి.. లేకపోతే అది పెద్ద తప్పిదమే అవుతుందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగొంచి.. శుభ్‌మన్ గిల్‌ను సారథిగా ఎంపిక చేశారు. బీసీసీఐ నిర్ణయం క్రికెట్ ప్రపంచంను ఆశ్చర్యంకు గురిచేసింది. సెలెక్టర్ల ఈ నిర్ణయంపై రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కొన్ని నెలల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలుచుకుంది. ఫైనల్లో హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రోహిత్ పేరు ట్రెండింగ్‌లో ఉంది.…