బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేసాడు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా.. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. రోహిత్ తన సతీమణి రితికా సజ్దే ప్రసవం నేపథ్యంలో ముంబైలోనే ఉన్నాడు. రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. టీమిండియా కెప్టెన్ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న (శుక్రవారం) మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ శర్మకు కొడుకు పుట్టడంతో అతని కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు నలుగురయ్యారు. రోహిత్, రితిక దంపతులకు 2018లో సమైరా అనే కూతురు జన్మించింది. కాగా.. కొడుకు పుట్టడంపై రోహిత్ శర్మతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ…
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ బీసీసీఐ నుంచి సెలవును అభ్యర్థించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు ఇప్పటికే కంగారో గడ్డకు చేరుకుంది. టీమిండియా ప్లేయర్స్ సాధన కూడా మొదలెట్టేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. రోహిత్ సతీమణి రితిక రెండో కాన్పు నేపథ్యంలో భారత్‌లోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రోహిత్ ఆసీస్ వెళ్లేదెప్పుడో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినా కూడా హిట్‌మ్యాన్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఆపలేదు. రోహిత్ ముంబైలో బ్యాటింగ్…
‘రోహిత్ శర్మ’ పేరు చెప్పగానే ప్రతి క్రికెట్ అభిమానికి అతడి భారీ హిట్టింగే గుర్తుకొస్తుంది. భారీ సిక్సులు బాదే రోహిత్‌కు ‘హిట్‌మ్యాన్’ అనే ట్యాగ్ ఉంది. రోహిత్ తన దూకుడైన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లికించుకున్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్లో అసాధారణమైన రికార్డులను తన పేరిట నమోదు చేశాడు. ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఒకప్పుడు వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేయడం ఎవరి…
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టులూ ఓడిపోయి భారత్ తీవ్ర పరాభవంను మూటగట్టుకుంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. రెండు టెస్టుల్లో ఓటమితో పాఠాలు నేర్వని రోహిత్ సేన.. మూడో టెస్టులో సైతం ఓడడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా కోచ్ గౌతమ్ గంభీర్‌లు ఓటమికి బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్లు అంటున్నారు.…
టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌తో తేలిపోనుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పారు. ఈ ఇద్దరు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తే మరికొంతకాలం ఆడే అవకాశం ఉంటుందన్నారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను గెలవడంపైనే దృష్టి సారించాలని, ఆ తర్వాతే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గురించి ఆలోచించాలని సన్నీ సూచించారు. మొన్నటివరకు అత్యంత బలంగా ఉందనిపించిన భారత జట్టుకు ఇప్పుడు కఠిన సవాల్ ఎదురుకానుందని గవాస్కర్…
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఓడిపోయింది. టెస్టు చరిత్రలో భారత గడ్డపై రెండో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది. దీనికి కారణం స్పిన్‌లో మనోళ్లు తేలిపోవడమే. స్వదేశంలో స్పిన్ పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడం టీమిండియాకు అలవాటు. ఇప్పుడు మన బలమే బలహీనతగా మారింది. మన స్పిన్ ఉచ్చు మన మెడకే చుట్టుకుంటోంది. దాంతో రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ స్పందించాడు.…
Team India: న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై.. అదీ స్పిన్ పిచ్‌లపై టీమిండియా పూర్తిగా విఫలమవడం వల్ల కొంతమంది సీనియర్లకు సెగ తగిలేలా కనబడుతుంది.