ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగిన భారత్, న్యూజిలాండ్ 3 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ముంబైలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం ముందర బొక్కబోర్లా పడింది. దాంతో 25 పరుగులతో కివిస్ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 3 – 0 తో క్లీన్ స్వీప్ అయ్యింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునేందుకు టీమిండియా పరిస్థితి దారుణంగా తయారయింది.
Team India - WTC: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి టీమిండియా.. మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుందామనే ఆశలకు గండికొట్టేలా కనిపిస్తుంది. ఈ సిరీస్ ముందు వరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన టీమిండియా.. ఇప్పుడు 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోవడంతో సెకండ్ ప్లేస్ లోకి పడిపోయింది.
మొదటి రోజు డ్రెస్సింగ్ రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు.. ఏదో చెబుతున్నట్లు కనిపిస్తున్నాడు. వీడియోలో ఆ మూమెంట్ చూస్తే.. పంత్‌ను రోహిత్ శర్మ తిట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే.. వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు కానీ.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఏదో విషయంలో కోపంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే భారత్ కోల్పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ వైట్‌వాష్ కాకుండా చూసుకోవాల్సిన దానిపై టీమిండియాపై ఉంది.
IND vs NZ: ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది.
నేడు (సెప్టెంబర్ 31) ఐపీఎల్ 2025 సంబంధించి అన్ని జట్లకు రిటెన్షన్ ప్లేయర్ల వివరాలు తెలిపేందుకు చివరి తేదీ. నేటి సాయంత్రం ఏఏ జట్టు ఏఏ ఆటగాళ్లను అంటిపెట్టుకొని ఉందన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పటికే ఐపీఎల్ లోని వివిధ జట్లు ఏ ఆటగాళ్లను ఉంచుకోవాలో.. ఏ ఆటగాళ్లను వేళానికి వదిలేస్తుందన్న వివరాలు దాదాపు ఒక అంచనాకు వచ్చాయి. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది మార్చి చివరివారం లేదా.. ఏప్రిల్ మొదటి వారంలో మొదలు కాబోయే ఐపీఎల్…
సుదీర్ఘకాలం అనంతరం స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్‌పై మొదటి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కివీస్‌కు అప్పగించింది. సొంతగడ్డపై చెత్త ప్రదర్శన చేసిన రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పిన్ ఆడటంలో విఫలమైన బ్యాటర్ల ఆట తీరును ఎత్తిచూపుతున్నారు. కొందరు రోహిత్ శర్మ కెప్టెన్సీ పైనా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ హిట్‌మ్యాన్‌కు మద్దతు పలికాడు. న్యూజిలాండ్‌పై సిరీస్ ఓటమికి రోహిత్…
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమికి సీనియర్ ఆటగాళ్లదే బాధ్యత అని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. జట్టుపై కోచ్ ప్రభావం చాలా తక్కువ అని నా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ మైదానంలో అడుగు పెట్టడని, కెప్టెనే అన్నీ చూసుకుంటాడన్నాడు. ఓటములు ఎదురైనపుడు విమర్శలు వస్తే.. వాటినీ తీసుకోవాలని డీకే పేర్కొన్నాడు. రోహిత్ సేన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్‌కు కోల్పోయిన విషయం తెలిసిందే. ‘న్యూజిలాండ్ సిరీస్ ఓటమి బాధ్యతను సీనియర్లకు…
పుణె టెస్టులో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత్‌లో కివీస్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 12 ఏళ్లలో 18 సిరీస్‌ల తర్వాత భారత్ సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. స్పిన్ ట్రాక్ పైనే ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం టీమిండియాకి ఎంతో నష్టాన్ని మిగిల్చింది. మిచెల్ సాంట్నర్ లాంటి స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.