RIP GOUTAM GAMBHIR: టీమిండియా ఐదో టెస్టులో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత, క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మను ఐదో టెస్ట్ నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో “RIP Gautam Gambhir” అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి వేలాదిగా ట్వీట్లు చేస్తున్నారు. గంభీర్ టీమ్ మేనేజ్‌మెంట్‌లో చేరిన తర్వాత టీమిండియాకు వరుస ఓటములు ఎదురవుతున్నాయని, ఇలా కొనసాగితే టీమ్ పనితీరు మరింత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా “తప్పించాల్సింది రోహిత్ ను కాదు, గంభీర్‌ను” అంటూ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన టీమిండియాలో జరుగుతున్న ఆంతర్యుద్ధాలపై వెలుగునిస్తున్నట్లు భావించవచ్చు. అభిమానులు తమ భావాలను పంచుకోవడంలో సోషల్ మీడియాను ప్రధాన వేదికగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ విమర్శలపై గౌతమ్ గంభీర్ లేదా టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. మూడు వికెట్స్ కోల్పోయిన భారత్!
ఇక నేడు మొదలైన సిడ్నీ టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్‌కు ముందు చివరి బంతికి గిల్ లయ తప్పడంతో 20 పరుగులకు ఔటయ్యాడు. అప్పటి వరకు కాస్త నిలకడగా ఆడిన గిల్ (20) నాథన్ లయన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అంతకముందు ఓపెనర్లు కేఎల్ రాహుల్ 4, యశస్వి జైస్వాల్ 10 పరుగులకే విఫలమయ్యారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 12 పరుగుల వద్ద క్రీజ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చినా జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు కనపడడం లేదు.