టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ వచ్చే ఫిబ్రవరి 7న ప్రారంభమై.. మార్చి 8న ముగుస్తుంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ కార్యక్రమంలో…
సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్షాన్ని భారత్ 38.2 ఓవర్లలోఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74)లు కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం కామెంటేటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రిలతో రో-కోలు మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెట్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం చెందారు. మరోసారి ఆస్ట్రేలియా…
Ravi Shastri: భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య దేశంతో మూడు వన్డేలు, ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. తాజా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భాగం అయ్యారు. ఏడు నెలల విరామం తర్వాత రోహిత్ – కోహ్లీ ద్వయం భారత జట్టు తరపున మైదానంలోకి దిగనున్నారు. కాబట్టి అందరి దృష్టి వారిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. READ ALSO:…
Rohit Sharma Records: బుధవారం (అక్టోబర్ 16) నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా ఆడుతున్న టీమిండియా.. సొంతగడ్డపై ఈ సిరీస్‌ను సైతం ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తొలి టెస్టు బెంగళూరులో, రెండో టెస్టు పుణెలో, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. అవేంటో ఓసారి చూద్దాం.…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ముంబైలోని ఓ సిగ్నల్ వద్ద అభిమానికి సెల్ఫీ ఇచ్చాడు. అంతేకాదు షేక్ హ్యాండ్ ఇచ్చి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘హిట్‌మ్యాన్ గ్రేట్’, ‘రోహిత్ సూపర్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: Hardik Pandya: బంగ్లా చిన్న జట్టు.. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు: ఆర్పీ సింగ్ ఇటీవల బంగ్లాదేశ్ టెస్టు…
Rohit Sharma Eye on Big Record in IND vs BAN Test Series: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ ఏడాదిలో రోహిత్ మూడు…
Rohit Sharma about T20 World Cup: టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా తమకు మద్దతుగా నిలిచారని.. అందుకే తన నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్లేయర్స్ అందరూ ఎంతో కష్టపడ్డారని చెప్పాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగిన అనుభూతిని తాను మాటల్లో చెప్పలేనని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.…
Rohit Sharma Heap Praise on Jeffrey Vandersay: బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఓడిపోయాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వండర్సే (6/33) అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని, అతడే తమ పతనాన్ని శాసించాడని పేర్కొన్నాడు. మిడిలార్డర్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఉందని రోహిత్ చెపుకొచ్చాడు. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 241…
Rohit Sharma React on Retirement: భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో మాత్రం ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే టెస్ట్, వన్డే ఫార్మాట్ల నుంచి కూడా రోహిత్ త్వరలోనే తప్పుకుంటాడని సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌కు…
Rohit Sharma Announce Retirement From T20 Internationals: టీమిండియా కెప్టెన్, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. దాంతో 11…