Rohit Sharma Retirement: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్!
- విశ్వవిజేతగా భారత్
- రోహిత్ సంచలన నిర్ణయం
- టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Announce Retirement From T20 Internationals: టీమిండియా కెప్టెన్, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. దాంతో 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరపడింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘టీ20 క్రికెట్‌లో ఇదే నా చివరి మ్యాచ్. వీడ్కోలు పలకడానికి ఇంతకుమించి మంచి సందర్భం, సమయం లేదు. నా టీ20 కెరీర్‌లో ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాను. పొట్టి ఫార్మాట్‌తోనే భారత్ తరఫున నా కెరీర్ మొదలైంది. ఈసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కచ్చితంగా గెలవాలనుకున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదు. ఈ సందర్భం కోసం నా జీవితంలో ఎంతో ఎదురుచూశాను. ఎంతో నిరాశకు గురయ్యాను. ఎట్టకేలకు నా కల నెరవేరింది’ అని చెప్పాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
2007 టీ20 ప్రపంచకప్‌తో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. 159 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 4,231 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు, 32 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక రోహిత్ సారథ్యంలోనే భారత జట్టు వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. టీ20లలో హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలు అందుకోనున్నాడు.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!