విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ ఇసుక లారీ భీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో నోవాటల్ పక్కన ఎత్తుగా ఉన్న రోడ్డు నుండి బీచ్ రోడ్డులోకి ఇసుక లోడ్ తో వస్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొని చిల్డ్రన్ పార్కులోకి లారీ దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన…
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రైతు కూలీలతో వెళుతున్న…
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీ మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను పల్లె వెలుగు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఏడుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మినుము చేను పీకడానికి సుద్ధపల్లి నుండి కంతేరుకు 10 మంది మహిళా కూలీలు ఈరోజు ఉదయం ఆటోలో బయల్దేరారు. చేబ్రోలు మండలం…
మహా కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులతో వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు మృతిచెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ముదిగొండ వద్ద మూల మలుపు వద్ద వేగంగా వెళుతున్న గ్రానైట్ ఆటో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడటంతో.. అందులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఎనమిది మందిని స్థానికులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం నుంచి ఆటో ట్రాలీలో గ్రానైట్ రాళ్ళు తీసుకుని…
మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నగరంలోని నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు త్వరిగతిన చేపట్టాలని సీఎం ఆదేశించారు. జబల్పూర్ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన…
Road Accident: సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన గ్వాటెమాలా రాజధానికి సమీపంలోని ప్రాంతంలో జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు నియంత్రణ కోల్పోయి 65 అడుగుల లోతైన ప్రాంతనంలో పడిపోయింది. అందిన సమాచారం మేరకు ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 55 మంది మృతి చెందారు. మరికొంత గాయపడ్డారు. Read Also: Harbhajan-Akhtar: గ్రౌండ్ లోనే బాహాబాహీకి దిగిన హర్భజన్ సింగ్, అక్తర్.. వీడియో వైరల్ స్థానిక అధికారులు తెలిపిన…
Organ Donation: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ వద్ద జరిగిన విషాద రోడ్డు ప్రమాదం విషాదంగా ముగిసింది. తొమ్మిది రోజుల క్రితం డివైడర్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు యశ్వంత్, భూమిక తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డాక్టర్ యశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, డాక్టర్ భూమిక గాయాలతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, డాక్టర్ భూమికకు బ్రెయిన్ డెడ్ కావడంతో.. అవయవ దానం చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించుకుంది. ఈ…
Telangana Police: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) గుండెపోటుతో కన్నుమూశారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. Also Read: Singer Chinmai: సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై.. వైరల్ కామెంట్స్ చేసిన…
Road Accident: జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉండవల్లి మండలంలో శనివారం ఉదయం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లారీని ఒకదాని తరువాత ఒకటి ఢీకొనడం వల్ల సంభవించింది. ప్రమాద సంగీతనకు సంబంధించిన వివరాలు ప్రకారం, ముందుగా బండల లారీ యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుండి కడప వెళ్ళిపోతున్న సిజిఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వెంటనే వెనక నుంచి మరో ట్రావెల్స్ బస్సు, హైదరాబాద్…