Rangareddy District: ప్రాణం తీసిన వేగం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత
- రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం
- రావిర్యాల ఎగ్జిట్ 13 వద్ద ఘటన
- నీళ్ల ట్యాంకర్‌ను ఢీ కొట్టిన కారు
- స్పాట్‌లోనే ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతి వేగం ప్రమాదకరం… అనే మాటలు దాదాపు ప్రతి హైవే మీద చదువుతాం. ఎందుకంటే వేగంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురికావడం కంటే తక్కువ వేగంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఇది ఆ పదబంధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కానీ, కొందరు వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. దాంతో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇందుకు నిదర్శనంగా జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
READ MORE: GlocalMe PetPhone: మనుషులకే కాదు.. ఇకపై పెంపుడు జంతువులకూ ఫోన్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఎగ్జిట్ 13 వద్ద రాములు అనే వ్యక్తి వాటర్ ట్యాంకర్ తో చెట్లకు నీళ్లు పడుతున్నాడు. వెనుకనుంచి వేగంగా వచ్చిన బ్రీజా కారు రాములుతోపాటు ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నడిపిన వ్యక్తి శేరిలింగంపల్లి చెందిన కృష్ణ రెడ్డిగా గుర్తించారు. పెద్ద అంబర్పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న బ్రీజా కార్.. రావిర్యాల టోల్గేట్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ట్యాంకర్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు.. కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?