రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓవర్ స్పీడ్, అజాగ్రత్త కారణంగా వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో పలువురు గాయాలపాలవుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు.
Also Read:Off The Record: ప్రభుత్వాన్ని ప్రశ్నించారా..? ఇరుకున పెట్టారా..?
అడిషనల్ డీసీపీ వాకింగ్ చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బాబ్జీ స్పాట్ లోనే మృతిచెందారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీసీపీ బాబ్జీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.