కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు (14…
Road Accident: భారత స్టార్ షూటర్ మను భాకర్ గృహంలో నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న మను భాకర్కి ఈ విషాద సంఘటన బాధ కలిగించింది. రెండు రోజుల క్రితం ఆమె మామ, అమ్మమ్మ మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు మను భాకర్ మామ యుధ్వీర్ సింగ్, అమ్మమలు మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో స్కూటీపై…
ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 23 ఏళ్ల టీవీ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. ధర్తీపుత్ర నందిని అనే సీరియల్లో అమన్ జైస్వాల్కు మంచి పేరు వచ్చింది.
చిత్తూరు శివారు ప్రాంతం గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న టిప్పర్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం 20 అడుగులు జారుకుంటూ రోడ్డు…
మహారాష్ట్రలోని షిర్డీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
శ్రీశైలం సమీపంలో మరో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. శ్రీశైలం సమీపంలోని శిఖరం నుండి ఇష్టకామేశ్వరి గేటుకు వెళ్లే మార్గం మధ్య దారిలో నల్లమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి భక్తులకు చెందిన ఓ ఎలక్ట్రికల్ వాహనం చెట్లకు ఢీ కొట్టింది..
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి (మం) కళ్యాణి డ్యామ్ దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు.. మదనపల్లి బస్సు డ్రైవర్ బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.
Road Accident: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబంలోని ఇద్దరు తండ్రి, కొడుకు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా గాంధీ నగర్ లో ప్రమాదం జరిగింది.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో దాదాపుగా నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ పండగ సీజన్ కావడంతో భారీగా వస్తున్న వాహనాలని క్రమబద్ధీకరించడం పోలీసులకు భారంగా మారింది. తనికెళ్ల సమీపంలో హైదరాబాద్ నుంచి ఒడిస్సా వెళ్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సును వెనకవైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ట్రావెల్ బస్సు ముందు మరో వాహనాన్ని(లారీ) ఢీకొట్టింది.…