వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో దివ్వెల మాధురి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో వెళ్తున్న మాధురి.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు.
Narsingi Crime: నార్సింగ్ మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధార్ కార్ అత్యంత వేగంగా ప్రయాణించి టిప్పర్ లారీని బలంగా ఢీ కొట్టింది.
Road Accident: ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఢిల్లీ ప్రభుత్వ అధికారి తన SUV కారుతో బైక్‌ను ఢీకొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢీకొన్న తర్వాత కారు, బైక్‌లు దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఝండేవాలన్ ప్రాంతంలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్యూవీ డ్రైవర్ ను ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్సి మీనాగా గుర్తించారు. ఈ ఘటనలో రాపిడో బైక్ నడుపుతున్న యువకుడు ఆసుపత్రిలో…
నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో మచ్చ బొల్లారంకి చెందిన కన్నయ్య (22) ఉన్నాడు. మరో ఇద్దరు కొంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కన్నయ్య అనే వ్యక్తి కారులోనే విహారయాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీ కొట్టి కింద పడటంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు.
Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ఆగ్రా వైపు వస్తున్న హైస్పీడ్ డబుల్ డెక్కర్ బస్సు సైఫాయ్ సమీపంలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై జేసీబీల లోడుతో ఆగివున్న ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Chanda Nagar Road Accident: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారు చందానగర్‌కు చెందిన మనోజ్, రాజులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Also Read: Tomato Price Hike: సామాన్యులకు షాక్..…