చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగలి ఘాట్ రోడ్ దగ్గర బస్సు బీభత్సం సృష్టించింది. రెండు లారీలను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. 40 మందికి గాయాలయ్యాయి.
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు.
ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది.. విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలోని భూసాయవలస వద్ద మంత్రి సంధ్యారాణి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం సంభవించింది.. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో.. ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం.. ఓ వ్యాన్‌ను ఢీ కొట్టింది.
వయనాడ్‌లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో…
తూర్పు గోదావరి జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురి దుర్మరణం చెందారు.. దీంతో.. దేవరపల్లి, ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం హులేబీడు సమీపంలో జైలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో వేగంగా వెళ్తున్న బస్సు... పికప్‌ను బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. పికప్‌లో సుమారు 35 మంది ఉన్నారు.
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో, ఏసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. ఇందులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఆగ్రా అలీగఢ్ బైపాస్ రోడ్డులోని మాటై గ్రామ సమీపంలో ఈరోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. బస్సు ఆగ్రా నుంచి డెహ్రాడూన్ వెళ్తున్నట్లు సమాచారం.
అన్నమయ్య జిల్లా సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కంటైనర్ లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గువ్వల చెరువు ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా.. కారు కడప నుండి రాయచోటికి వెళ్తున్న సమయంలో కంటైనర్ ను ఢీకొట్టింది.