Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు చాలాసార్లు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు మరణించగా, 19 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. Redmi 13 5G Price: భారత్ మార్కెట్‌లోకి రెడ్‌మీ 13 5జీ.. ఫోన్‌తో పాటే ఛార్జర్! అందిన సమాచారం ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సు…
గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో చిక్కుకుంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మీద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది.
మెదక్ జిల్లా వడియారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట(మం) వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. లారీ క్యాబిన్లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి మేకల లోడుతో హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కాగా..…
Road Accident : తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం – కొత్తపాలెం రహదారి ప్రాంతంలో ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనలోని మృతులు గుంటూరు ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. వీరంతా పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది. ఘటనపై…
పూణె పోర్స్చే ఘటన తరహాలో మహారాష్ట్రలో మరో ప్రమాదం జరిగింది. ఎస్యూవీ వాహనం అదుపుతప్పి బారికేడ్ను ఢీకొట్టింది. దీంతో.. కారు టైర్ ఊడిపోయి పక్కనే వస్తున్న ఆటోకు తగలింది. ఈ క్రమంలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే.. మద్యం మత్తులో 21 ఏళ్ల యువకుడు కారును నడుపినట్లుగా తేలింది. ఈ ప్రమాదం.. పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని జగ్తాప్ డెయిరీ సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి…