Bus Accident: రోడ్డు పక్కన ఆగి ఉన్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తిరుచ్చి-చెన్నై హైవేపై వ్యాన్ డ్రైవర్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిపడ్డ యువతులు.. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం లక్ష్మీ తోమర్ (24), దీక్ష జాదన్ (25)లు ఇండోర్లోని ఖజరానా ఆలయాన్ని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మహాలక్ష్మి…
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న ఆరుగురు మృత్యువాత చెందారు. ఖతుశ్యామ్ బాబాను దర్శించుకునేందుకు వెళ్తుండగా జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం భక్తులతో వెళ్తున్న కారును ఢీకొట్టింది.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి కనుమదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సమాచారం అందిందని తెలిపారు.