Minister Ram Prasad Reddy: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రభుత్వం తరఫు నుంచి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక లక్ష రూపాయలు సహాయం ఇస్తామన్నారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారని, 31 మంది గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామన్నారు.
Read Also: Kadambari Jethwani: ముంబయి నటి జేత్వాని ఫిర్యాదు.. కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు