టీమిండియా ఓటమి చవిచూసినప్పుడల్లా.. కెప్టెన్లపై విమర్శలు వెల్లువెత్తడం సర్వసాధారణం. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, కెప్టెన్ తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓటమి చవిచూసిందంటూ కొందరు కావాలనే విమర్శలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు రిషభ్ పంత్‌పై అలాంటి విమర్శలే వస్తున్నాయి. రిషభ్ నాయకత్వంలో భారత్ 211 పరుగులు కొట్టినా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాల్వడంతో అతడ్ని విమర్శిస్తున్నారు. జట్టును నడిపించేంత సామర్థ్యం అతనికి లేదని, ఎవరైనా సీనియర్ ప్లేయర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే రిషభ్‌కు…
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! భారీ స్కోరు (211) చేసినప్పటికీ.. బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా బోల్తా కొట్టేసింది. దీంతో, ఈరోజు జరగనున్న రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. అందుకు బౌలింగ్ విభాగంలో భారత్ పుంజుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయంలో భారత్‌కి ఎలాంటి ఢోకా లేదు. ఆరో వికెట్ దాకా దూకుడుగా రాణించే బ్యాట్స్మన్లే ఉన్నారు.…
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్ 1న ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో దీపక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జయ భరద్వాజ్‌కు చాహర్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించడంతో.. ఏడాది పాటు ఈ జంట ప్రేమ మత్తులో మునిగి తేలింది. గాయంతో దీపక్ చాహర్ క్రికెట్ కెరీర్‌కు బ్రేక్ రావడంతో వివాహం చేసుకున్నారు. ఆగ్రాలో…
ఐపీఎల్ టోర్నమెంట్ ముగియడంతో.. ఇప్పుడు అందరి దృష్టి సౌతాఫ్రికా, భారత్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై పడింది. ఈ నేపథ్యంలోనే మాజీలందరూ ఈ సిరీస్‌పై తమతమ అంచనాల్ని వెల్లడించడం మొదలుపెట్టారు. ఏ జట్టు సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది? టీమిండియాలో ఎవరు బాగా రాణించగలరు? ఎవరెవరు ఏయే స్థానాల్లో దిగితే బాగుంటుంది? అనే విషయాలపై తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషభ్ పంత్,…
ఒక్క తప్పు.. కేవలం ఒకే ఒక్క తప్పు వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్లేఆఫ్స్‌కు వెళ్ళే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. ఆ తప్పు చేసిన కెప్టెన్ రిషభ్ పంత్.. అందరి దృష్టిలో విలన్ అయ్యాడు. ఒకవేళ ఆ తప్పు జరగకపోయి ఉంటే, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది. ఆ వివరాల్లోకి వెళ్తే.. 15వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ మొదట డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి టిమ్ డేవిడ్…
ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిసిన ఢిల్లీ, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. బ్యాటింగ్ కోసం బరిలోకి దిగిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైన.. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు), పడిక్కల్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న వెస్టిండీస్‌తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్…
సెంచూరియన్ : సెంచురియన్ భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 174 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తద్వారా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అత్యధికంగా రిషబ్ పంత్ 34 పరుగులు చేశాడు. Read Also: విశాఖలోనూ న్యూయర్ వేడుకలపై ఆంక్షలు: మనీష్ కుమార్ సిన్హా సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, మార్కో జాన్సెన్ లు చెరో 4 వికెట్లు తీశారు. లుంగి ఎంగిడి 2 వికెట్లు…
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యంపై యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్‌పంత్‌తో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వీడియో కాల్‌లో మాట్లాడారు. రాష్ట్ర యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బ్రాండ్ అంబాసడర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక దీనిపై కీపర్ రిషబ్ పంత్ కూడా తన స్టైల్ లో స్పందించారు. ఇలాంటి గౌరవం దక్కడం తనకు చాలా ఆనందంగా…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ లో ప్రారంభమైన అప్పుడు కరోనా కారణంగా దానిని వాయిదా వేశారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం బారినపడి దూరం కావడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ యాజమాన్యం. అయితే ఇప్పుడు వాయిదా పడిన సీజన్ మళ్ళీ యూఏఈ వేదికగా ప్రారంభం అయ్యింది. అలాగే గాయం ఉంది కూడా…