ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిసిన ఢిల్లీ, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. బ్యాటింగ్ కోసం బరిలోకి దిగిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైన.. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు), పడిక్కల్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరగులు) చెలరేగిపోయారు. మ్యాచ్ మొత్తంలో వీళ్ళిద్దరే నిలకడగా రాణించారు. వీళ్ళ తర్వాత వచ్చిన బ్యాట్‌మెన్స్ ఎవరూ తమ సత్తా చాటలేకపోయారు.
ఢిల్లీ బౌలింగ్ విషయానికొస్తే.. దాదాపు ప్రతి బౌలర్ రాజస్థాన్ బ్యాట్‌మెన్స్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. చేతన్ సకారియా, అన్రిచ్ నోర్ట్యే, మిచెల్ మార్ష్ చెరో రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. అయితే.. అక్సర్ పటేల్ మాత్రం రెండు ఓవర్లలోనే 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఢిల్లీ ముందున్న టార్గెట్ మరీ పెద్దదేమీ కాదు, అలాగని దాన్ని అంత సులువుగా తీసిపారెయ్యలేం కూడా! నిలకడగా రాణించగలిగితే, లక్ష్యాన్ని చేధించొచ్చు. ఢిల్లీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకమైంది. ఇది నెగ్గితే, ప్లేఆఫ్స్‌కి అవకాశాలుంటాయి. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.