టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యంపై యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్‌పంత్‌తో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వీడియో కాల్‌లో మాట్లాడారు.
రాష్ట్ర యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బ్రాండ్ అంబాసడర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక దీనిపై కీపర్ రిషబ్ పంత్ కూడా తన స్టైల్ లో స్పందించారు. ఇలాంటి గౌరవం దక్కడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి.. ఈ గౌరవాన్ని ఇచ్చిన ఉత్తరాఖండ్ కు రుణపడి ఉంటానని చెప్పారు.