Rishabh Pant: ఆ ఒక్క తప్పు చేసిన పాపానికి విలన్ అయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క తప్పు.. కేవలం ఒకే ఒక్క తప్పు వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్లేఆఫ్స్‌కు వెళ్ళే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. ఆ తప్పు చేసిన కెప్టెన్ రిషభ్ పంత్.. అందరి దృష్టిలో విలన్ అయ్యాడు. ఒకవేళ ఆ తప్పు జరగకపోయి ఉంటే, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది. ఆ వివరాల్లోకి వెళ్తే..
15వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ మొదట డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి టిమ్ డేవిడ్ వచ్చాడు. శార్దూల్ ఆఫ్ స్టంప్ అవతల బంతి విసిరగా.. దాన్ని కవర్స్ దిశగా పుష్ చేసేందుకు డేవిడ్ ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ పక్కనుంచి నేరుగా కీపర్ చేతిలోకి వెళ్ళింది. ఆ బంతి బ్యాట్‌కు తాకినట్టు శబ్దం రావడంతో, పంత్ ఔట్‌కు అప్పీల్ చేశాడు. కానీ, ఫీల్డ్‌లో ఉన్న అంపైర్ ఔట్ కాదన్నట్టు తలూపాడు. పంత్ వ్యవహార శైలి చూసి.. అతడు కచ్ఛితంగా రివ్యూ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కాసేపు శార్దూల్‌తో చర్చలు కూడా జరిపాడు. చివరికి పంత్ రివ్యూకి వెళ్ళలేదు. ఒక బంతి వేసిన.. రీప్లేలో ఆ బంతి బ్యాట్‌కు తాకినట్టు అల్ట్రా స్పైక్ కనిపించింది.
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రివ్యూకి వెళ్ళి ఉంటే, గోల్డెన్ డక్‌గా టిమ్ డేవిడ్ పెవిలియన్ చేరుకునేవాడు. కానీ, రివ్యూకి వెళ్ళపోవడం వల్ల టిమ్ డేవిడ్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత విజృంభించాడు. 11 బంతుల్లోనే 4 సిక్సులు, 2 ఫోర్లతో 34 పరుగులు చేసి.. ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అతని వల్లే మ్యాచ్ మలుపు తిరిగింది. ఒకవేళ టిమ్ గోల్డెన్ డక్ అయ్యుంటే, ముంబై కచ్ఛితంగా ఓడిపోయేది. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుకునేది. కానీ.. పంత్ రివ్యూకి వెళ్ళకపోవడం వల్ల ఢిల్లీ ఇంటి దారి పట్టింది. దీంతో.. పంత్ చేసిన తప్పు వల్ల ఢిల్లీ ఓడిందంటూ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్‌గా పంత్ పనికిరాడని, అతని వల్లే ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు దూరమైందని విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!