భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో రాంచిలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. తెంబా బావుమా, కేశవ్ మహారాజ్‌లకు విశ్రాంతి ఇచ్చామని చెప్పాడు. ఈరోజు నలుగురు సీమర్లతో బరిలోకి దిగుతున్నట్లు మార్క్రమ్ తెలిపాడు. బావుమాకు రెస్ట్…
గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 140 పరుగులకు ఆలౌటై.. 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీస పోరాటం సి కూడా చేయలేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ చెలరేగిన అదే పిచ్‌పై భారత్ బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా టాప్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. ఈ ఓటమితో సిరీస్‌ను 2-0తో భారత్ కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌పై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నెగ్గింది.…
Rishabh Pant: టీమిండియా ప్రస్తుతం గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ఆడుతుంది. కోల్‌కతా టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ మెడనొప్పితో స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు.
ఆసియా పిచ్‌లలో.. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లలో టాస్ గెలవడం ఏ జట్టుకైనా అత్యంత చాలా కీలకం. కానీ భారత్ మాత్రం వరుసగా టాస్ ఓడిపోతోంది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా టాస్ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కూడా టాస్ కలిసిరాలేదు. కోల్‌కతా టెస్టులో సారథి శుభ్‌మాన్ గిల్ టాస్ ఓడగా.. గౌహతి టెస్ట్‌లో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ అయినా టాస్ నెగ్గుతాడు అనుకుంటే అది…
Ricky Ponting: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోతే.. ఆ బాధ్యతలు స్వీకరించడానికి రిషబ్ పంత్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉందని పేర్కొన్నాడు. గిల్ మెడ గాయం కారణంగా నవంబర్ 22న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Smriti…
మరికాసేపట్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ బ్యాటర్లు మంచి ఫామ్ మీదున్నారని, అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నానని బావుమా చెప్పాడు. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోందని, మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చాలా కీలకం అని పేర్కొన్నాడు. కగిసో స్థానంలో కార్బిన్ ఆడుతున్నడని బావుమా చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించనుందని టీమిండియా…
శుక్రవారం (నవంబర్ 14) నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఆడనున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో పంత్ కాలికి గాయమైంది. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు జట్టుకు దూరమైన అతడు కోల్‌కతా టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్నాడు. వైస్ కెప్టెన్ కూడా అయిన పంత్‌కు…
Rishabh Pant: టీమిండియాలోకి ఓ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. నవంబర్ 14 నుంచి ఇరు జట్లు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే టైంలో టీమిండియా స్టార్ ప్లేయర్ గురించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. గాయం నుంచి కోలుకున్న…
మూడు నెలల విరామం తర్వాత టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న నాలుగు రోజుల మొదటి మ్యాచ్‌లో పంత్ ఆడుతున్నాడు. భారత్-ఏ జట్టు సారథిగా వ్యవహరిస్తున్న పంత్.. బ్యాటింగ్ చేయకముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఇందుకు కారణం అతడు టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ ధరించడమే. దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రిషభ్ పంత్ బౌలింగ్…
గాయం కారణంగా భారత జట్టు నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో త్వరలో జరిగే రెడ్ బాల్ సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరఫున పంత్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. గత జూలైలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లోని మాంచెస్టర్ టెస్ట్ (నాలుగో టెస్టు)లో పంత్ పాదానికి గాయమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న బెంగళూరులోని…