ఏడాది కాలంగా జాతి హింసకు గురవుతున్న మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సమీక్షించనున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. అందుకోసమని.. ఆదివారం రోజున మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే సమీక్ష కోసం వచ్చారు. ఈ క్రమంలో.. ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు.
రైలు డ్రైవర్లు వేగ పరిమితిని ఎందుకు మించిపోతున్నారు..? అనే విషయాలను తెలుసుకోవడానికి రైల్వే బోర్డు ఒక కమిటీని వేసింది. రైలు డ్రైవర్లు తరచుగా మొదటి, చివరి స్టేషన్ మధ్య వేగ పరిమితిని ఉల్లంఘిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా చేయడం వల్ల ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరం. ఇటీవలి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ చర్య తీసుకుందని రైల్వే సంబంధిత వర్గాలు తెలిపాయి. 2 రైలు డ్రైవర్లు నది వంతెనపై 20 kmph వేగ పరిమితిని ఉల్లంఘించారు. వంతెన…
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంహెచ్‌ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రియాసిలో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చించారు. ఈ క్రమంలో.. అమిత్ షా జూన్ 16న షా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి, అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ…
భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా.. ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా…
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. త్రైమాసిక టాక్స్ వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు…
కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించండని తెలిపారు.…
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 12 లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎం అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి చేరుకోగానే సీఎం రేవంత్ రెడ్డికి సీఎస్ శాంతకుమారి, తెలంగాణ డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పలువురు ఉన్నతధికారులు స్వాగతం పలికారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను సీఎం…
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర…
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో వచ్చ్హిన లేటెస్ట్ మూవీ “రత్నం”.ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఇదివరకే పూజ ,భరణి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రత్నం మూవీ హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కింది.. జీ స్టూడియోస్ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు.ఇదిలా ఉంటే హీరో విశాల్ కు తెలుగులో కూడా మాస్ ఫాలోయింగ్ వుంది.రత్నం మూవీని…
ఈ ఏడాది మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి .అదిరిపోయే కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ ఏడాది మలయాళంలో తెరకెక్కిన మంజుమ్మేల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్‌లైఫ్ వంటి సినిమాలు అద్భుత విజయం సాధించాయి.మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించాయి.ఇదిలా ఉంటే ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా “ఆవేశం” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన “ఆవేశం” మూవీ థియేటర్లలో వంద కోట్ల…