రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు సచివాలయంలో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఉద్దశ్యపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి, బస్తీలకు తక్కువ నీరు విడుదల చేసే సిబ్బంది పై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ఈరోజుల్లో సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లకు క్రేజ్ ఎక్కువ.. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ‘సేవ్ ద టైగర్స్’ అనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ గత ఏడాది ఏప్రిల్ లో వచ్చి మంచి విజయం సాధించింది.. అన్ని ఎపిసోడ్స్ కూడా బాగా పాపులారిటిని సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు ‘సేవ్ ద టైగర్స్ 2’ వచ్చేసింది .. ఇటీవల సీరిస్ కు…
అజయ్ దేవగణ్, ఆర్ మాధవన్ మరియు జ్యోతిక కీలకపాత్రలు పోషించిన సైతాన్ చిత్రానికి క్రమంగా వసూళ్లు పెరుగుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం జోరు చూపిస్తోంది. దర్శకుడు వికాస్ బాహ్ల్ ఈ చిత్రాన్నిసూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్‌గా తెరక్కించారు.మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ అయింది. సస్పెన్స్‌తో ఉత్కంఠభరితంగా ఈ మూవీ ఉందని ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా సైతాన్ చిత్రాన్ని చూసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని…
ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహించనుంది. అందుకు సంబంధించి భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను మంత్రి విడదల రజని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు 'సిద్ధం' సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి…
వైద్యాశాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష చేపట్టారు. సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వరంగల్లో 2100 బెడ్స్ సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్లోని అల్వాల్లో నిర్మిస్తున్న 1200 బెడ్స్ సామర్ధ్యం కలిగిన టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎల్బీనగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల…
గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండి రీజ్వితో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్…
మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఇందుకోసం ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని చారిత్రక…
ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి విస్తారంగా పెట్టుబడులు– పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు – ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది.
రేపు(మంగళవారం) ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపటి సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.