హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 12 లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎం అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి చేరుకోగానే సీఎం రేవంత్ రెడ్డికి సీఎస్ శాంతకుమారి, తెలంగాణ డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పలువురు ఉన్నతధికారులు స్వాగతం పలికారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
Read Also: Liquor Sales Prohibited: 5 రోజులు అక్కడ మద్యం అమ్మకాలు నిషేధం..
ఆ తర్వాత.. కమాండ్ కంట్రోల్ లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సీఎం రేవంత్ సమీక్ష జరుపుతున్నారు. అంతేకాకుండా.. కమాండ్ కంట్రోల్ లో ఉన్న నార్కోటిక్స్ బ్యూరో పని తీరుపై రివ్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో డ్రగ్స్ నిర్ములకు తీసుకోవాల్సిన అంశాలపై పోలీసు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు
Read Also: Hyderabad: బషీర్ బాగ్ సీసీఎస్ ముందు సాహితి ఇన్ ఫ్రా కంపెనీ బాధితులు ఆందోళన..