CM KCR-TRS: సీబీఐ, ఈడీ, ఐటీ చూస్తున్నాయి జాగ్రత్త. టీఆర్‌ఎస్ నేతలను అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్!.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR-TRS: కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆయన సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతల విషయంలో ఇన్నాళ్లూ వ్యవహరించిన తీరుగానే అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో సమావేశం నిర్వహించారని పార్గీ వర్గాలు తెలిపాయి.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఇన్‌కం ట్యాక్స్(ఐటీ) విభాగాలు హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేపడుతుండటాన్ని కేసీఆర్ ఈ భేటీలో ప్రముఖంగా ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. దీంతో గులాబీ నేతలు ఎక్కడ దొరుకుతారా కేసులు పెడదామా అని మోడీ ప్రభుత్వం కాచుకొని కూర్చుందని కేసీఆర్ తన పార్టీ నేతలను అలర్ట్ చేసినట్లు టాక్.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
Investment-Profit: 10 వేల పెట్టుబడి. ఏడాదిలోనే 2.77 లక్షలు. అతి భారీ లాభం
ఇందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన కూతురు ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తుండటాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారని చెబుతున్నారు. అందువల్ల రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన ప్రతిఒక్కరు, ప్రజాప్రతినిధులు ఇలాంటి అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలియవస్తోంది. అవినీతి, అవకతవకలు, కుంభకోణాల్లో ఇరుక్కో వద్దని, తద్వారా అనవసర ప్రచారాలకు, చెడ్డ పేరుకు తావు ఇవ్వొద్దంటూ పార్టీ కేడర్‌ని హెచ్చరించారని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
పాదయాత్రలో ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేయటం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల తలెత్తిన సంఘటనలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఉటంకించినట్లు భోగట్టా. 2014 నుంచి(ఎనిమిదేళ్లుగా) తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కమలం పార్టీ లీడర్లు మతం పేరుతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చెడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
విద్వేషపూరిత ప్రసంగాలతో, హింసాత్మక చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలుచేసిన పలు ఆదర్శవంతమైన విధానాల వల్ల దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెరిగాయని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతున్నాయని ఆయన చెప్పారని సంబంధిత వర్గాలు అన్నాయి. ఈ ప్రగతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతనూ కేసీఆర్ వివరించారని తెలిపాయి.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి