CM Jagan: ఏపీలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Review Meeting on Education Department: ఏపీలో విద్యాశాఖపై అధికారులతో శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు-నేడు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. పాఠశాలల్లో ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే బాగుచేసేలా ప్రత్యేక అధికారి చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అన్నారు.
Read Also: India Today Survey: వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోదీకే పట్టం.. ఏపీలో వైసీపీకే జై కొట్టిన ప్రజలు
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
మరోవైపు వచ్చే ఏడాది విద్యాకానుక కింద విద్యార్థులకు అందించే వస్తువులను ఏప్రిల్ నెలాఖరుకే సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటు చేయాలన్నారు. దశలవారీగా డిజిటల్ స్క్రీన్‌లను పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. అటు పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలని, దీనికోసం ఎస్‌ఓపీలను రూపొందించాలని సూచించారు. పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్ నాణ్యతను సీఎం జగన్ పరిశీలించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని, టెండర్లు ఖరారుచేసి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు.

తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!