Damodara Raja Narasimha: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ, రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రూ. 2700 కోట్ల వ్యయంతో, అత్యాధునిక…
Thatikonda Rajaiah : జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. షన్ ఘనపురం నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన జరుగుతుందన్నారు. పాతరోజులను తలపించే విధంగా కడియం శ్రీహరి మల్లీ అరాచకపు పాలన కొనసాగిస్తున్నాడని, ఆరు నెలల్లో ఆరుగురిపై అక్రమ కేసులు పెట్టించాడన్నారు తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిచి ఊసరవెల్లి లాగ పార్టీ…
తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా నూతన ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్ గంజ్లో ఉండగా.. నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేయనున్నారు.…
MLC Kavitha : నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది ? చేతిలో ఎర్రబుక్కు పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు ? అని ఆమె…
CM Revanth Reddy : పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఫిబ్రవరి 10 లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది సీఎం రేవంత్ రెడ్డి. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని…
Panchayat Elections : తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తర్జనభర్జనలో ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ ఇచ్చింది. నివేదిక అందిన వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం…
Chamala Kiran Kumar Reddy : పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతా అని అన్నారు భువనగిరి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలని, హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలన్నారు చామల కిరణ్ కుమార్. కేంద్రం బీహార్కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదని…
Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది? అని లేఖలో బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే… నేటి వరకు 65 లక్షల మంది…
Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్దేవ్రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో…