MLC Kavitha: జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని ఆవిడ పేర్కొన్నారు. ఐఫోన్ స్థిరమైన పనితీరుకు ప్రాధాన్యం కల్పిస్తే, చైనా ఫోన్ బయటకు బాగుంటుందని..…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని.. అందులో రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఆరోపించారు. సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మీ ఢిల్లీ బాసులు, మీ గల్లీ దోస్తులు ఆకలి తీర్చడం కాదు, ముందు మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టాలని సూచించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్, పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు తిండి పెట్టడంలో లేదా? అని ప్రశ్నించారు. అమృత్ స్కీమ్ను…
TG Congress Delhi Tour: తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేబినెట్ విస్తరణ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశమవుతున్నారు. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన…
Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం…
Telangana Congress: హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో…
తెలంగాణ అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు పడ్డాయి.
Caste Census : గ్రామాలలో కుల గణన, వర్గీకరణ సంబరాలు చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. నిన్న శాసనసభలో రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎన్నో ఏళ్ళు గా పెండింగ్ లో ఉన్న బిసి కులఘనన ను, ఎస్సీల వర్గీకరణ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. సమాజంలో రెండు ప్రధాన వర్గాలు బిసిలు, ఎస్సీ లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కులఘనన,…