World Economic Forum : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి…
సింగపూర్ పర్యటనలో మూడు రోజుల పాటు సీఎం, మంత్రి, రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకొచ్చింది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ రూ.450 కోట్లతో హైదరాబాద్‌లో ఐటీ…
Rasamayi Balakishan : కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ ఏది అంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ జెండానే చూపిస్తారన్నారు. దేవుడులాంటి కేసీఆర్‌ను దూరం చేసుకొని దయ్యం లాంటి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నమని ప్రజలంతా బాధపడుతున్నారని, అర గ్యారెంటీ అమలు చేసి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయని…
సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్‌లో అత్యాధునిక 1 మిలియన్ చదరపు అడుగుల పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ. 450 కోట్ల పెట్టుబడిని క్యాపిటల్‌ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ ఖియాతానీ ప్రకటించారు.
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు- నష్టపోతున్న లక్షలాది మంది తెలంగాణ లబ్దిదారులు అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ, పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గమని, అభయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు…
Bhatti Vikramarka : ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను…
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతూనే ఉద్యోగుల కష్టాలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. “మీ పాలనలో చిరు ఉద్యోగుల దుస్థితి దారుణంగా తయారైంది. వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు,” అని హరీష్ రావు పేర్కొన్నారు.…
TPCC mahesh Kumar Goud : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో పర్యటన కొనసాగుతోంది. విక్టోరియా రాష్ట్రం మెల్బోర్న్ నగరంలో ప్రభుత్వ అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైంది రాష్ట్ర బృందం. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆ రాష్ట్ర అధికారులతో క్రీడలపై రాష్ట్ర బృందం చర్చించింది. క్రీడలు, మౌళిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం. ఆస్ట్రేలియాలో…
AICC New Office: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌కు కాంగ్రెస్ పార్టీ వీడ్కోలు చెప్పింది. కొత్తగా నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు.
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమని, ప్రశ్నిస్తున్న ప్రజా…