CM Revanth Reddy : ప్రధాని మోడీతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీకి ఐదు అంశాలపై విజ్ఞప్తులు ఇచ్చానని, మెట్రో విస్తరణ, మూపీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్, ఏపీఎస్ కేడర్ల పెంపు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధానికి ఇవ్వాల్సిన విజ్ఞప్తులు ఇచ్చాను, బాధ్యత వహించి వాటిని తీసుకురావాల్సింది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్‌లు అని ఆయన అన్నారు. రాష్ట్రం తరఫున ఇచ్చిన విజ్ఞప్తులకు, కేంద్రం నుంచి నిధులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి దే అని, కిషన్ రెడ్డి సాధించుకుని వస్తే ఆయనకు బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తామన్నారు. ఇంతకాలం రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని, ప్రధానమంత్రి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. ఐదు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం తరఫున విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించిన రిప్రెజెంటేషన్ ప్రధాని నాకు ఇచ్చారని, 2014 నుంచి 2024 వరకు రాజ్యాంగం మారలేదన్నారు. గత పదివేల నుంచి శాసనం మారలేదని ఆయన మండిపడ్డారు. గత పది ఏళ్లలో పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మంత్రులను చేస్తే ఉప ఎన్నికలు రాలేదని, ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయన్నారు. లెజిస్టేచర్ పార్టీ విలీనం అనేది లేదని, పార్టీ నే సుప్రీమ్ అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై సీబీఐ విచారణ వేస్తే.. ఆ వంకతో బీజేపీలో కలిసిపోవచ్చు అనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
అంతేకాకుండా..’ప్రధానమంత్రి తో కులగణపై చర్చ జరగలేదు.. అసెంబ్లీలో బిల్ చేశాక చర్చిద్దాం అనుకుంటున్నాం.. నదులను పునరుద్ధరణ చేయడం మంచి ఆలోచనని ప్రధాని అన్నారు.. హైదరాబాదుకు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి.. హైదరాబాద్ మెట్రోలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకం.. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో సెకండ్ ప్లేస్ లో ఉండేది.. ఇప్పుడు 9 వ స్థానంలో పడిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము.. గెలుస్తామని అనుకుంటున్నాం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోటీ పెట్టలేదు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు.. మంత్రివర్గ విస్తరణ ఉందని నేను ఎప్పుడూ చెప్పలేదు.. పీసీసీ కమిటీ అంశం అధ్యక్షుని అడగండి.. శివరాత్రి పూజలు ఉన్నందునే భట్టి విక్రమార్క ఢిల్లీకి రాలేదు.. ప్రభాకర్ రావును రప్పించాలని కేంద్రానికి లేఖ రాశాను.. గత ప్రభుత్వ అవినీతిపై కమిషన్లు వేశాము.. కమిషన్ల నివేదిక వచ్చాకే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం… కొడంగల్ అసెంబ్లీ వ్యవహారాలు నా బ్రదర్ చూసుకుంటాడు.. కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నా బ్రదర్ ను పెట్టాం..’ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు
‘దుబాయిలో కేదార్ చనిపోతే కేటీఆర్ ఎందుకు విచారణ కావాలని కోరడం లేదు.. డ్రగ్స్ కేసులో కేదార్ ఉన్నాడు.. కొన్ని మిస్టీరియస్ డెత్ జరుగుతున్నాయి.. సంజీవరెడ్డి, రాజలింగమూర్తి ఇప్పుడు కేదార్.. రియల్ ఎస్టేట్ గతంలో కంటే మెరుగ్గానే ఉంది… ఏడు ఎనిమిది ఏళ్లకు ఒకసారి కరెక్షన్ జరుగుతూ ఉంటుంది.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈసారి అక్యుపేషన్ బాగా పెరిగింది… అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో నే పర్ఫామెన్స్ బెటర్ గా ఉంది… ‘ అని సీఎం రేవంత్ అన్నారు.
కిషన్ రెడ్డి పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
‘కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టనర్.. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు.. మెట్రో విస్తరణలో నాకు పేరు వస్తుందని, కేసీఆర్ హయాంలో ఇది జరగలేదు కాబట్టి నా హయాంలో జరగవద్దు అని కిషన్ రెడ్డి భావిస్తున్నారు.. అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టును క్యాబినెట్ లో అడ్డుకుంటున్నారు.. ‘ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
Vallabhaneni Vamshi: రెండో రోజు ముగిసిన వంశీ విచారణ.. 3 గంటలకు పైగా ప్రశ్నలు