తెలంగాణ ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్-కమిటీ తుది సమావేశానికి అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చట్టం యొక్క విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) అంబేద్కర్ జయంతి నాడు జారీ చేయబడుతుందని అన్నారు. జీఓ యొక్క మొదటి కాపీని ముఖ్యమంత్రి ఎ…
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్…
Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్రంలో పాలనపై విమర్శలు గుప్పిస్తూ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పై భరోసా వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ గతంలో చేసిన తప్పిదాలను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. “రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది – ఆయనే కొనసాగుతారు” అంటూ స్పష్టంగా తెలిపారు. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ పై విమర్శలు చేస్తూ, “అరవింద్ నిద్రలో కలలు కంటున్నట్టు ఉన్నారు”…
KTR : 2025 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి కీలకమని పేర్కొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఇప్పటివరకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. మార్చి 28న అనుమతికి అప్లై చేసినప్పటికీ ఇంకా ప్రతిస్పందన లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని, రాష్ట్రం రూపుదిద్దుకునే దశలో పుట్టిన ఈ పార్టీ ఇప్పటికి అరవై లక్షల సభ్యులను కలిగి ఉందన్నారు. “రజతోత్సవం ప్రభుత్వానికి విరుద్ధంగా నిర్వహించే సభ కాదు,…
CM Revanth Reddy : తెలంగాణలో పాలన మారిన కొద్ది నెలల లోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా ప్రకటించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం “ప్రజల ప్రభుత్వ” విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని…
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ…
నాగార్జున సాగర్ లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు.. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది.. కేసీఆర్ సీఎంగ ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పునర్నిర్మాణం వైపు ప్రజా ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్టర్ వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను 15 సంవత్సరాల పాటు నిర్వహించకపోవడం నిజంగా షాకింగ్ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో విద్య రంగం పట్ల చూపిన నిర్లక్ష్యం…