Jagadish Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా సీఎం గా కొనసాగేందుకు అర్హత లేదని ఆరోపించారు. ఆయన తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ తొలి నుంచీ చెబుతోన్న విషయం నేడు నిజమవుతుందన్న విషయం స్పష్టమైందన్నారు. “ఓనమాలు రాని వాడిలా పదో తరగతి చదివినట్లున్నది రేవంత్ తీరు,” అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ముప్పు లేదని, కానీ రేవంత్ పరిపాలనకు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
Alert.. Alert: తెలంగాణ వాసులారా బహుపరాక్.. నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్..!
కేసీఆర్ హయాంలో అప్పులనుంచి తెలంగాణ రాష్ట్రానికి రెండున్నర లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, కానీ రేవంత్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోగా, మంత్రుల ఆదాయం మాత్రం పెరిగిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్ర ఆదాయం లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. సీఎం పదవి కోసం మంత్రులు పోటీ పడి సంపాదనలో మునిగిపోతున్నారు” అని వ్యాఖ్యానించారు. హామీల కోసం దొంగ ఏడుపులు
రేవంత్ రెడ్డి హామీలను తప్పించుకునేందుకు “దొంగ ఏడుపులు” ఏడుస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. నిన్న సీఎం మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమని, ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే అని అన్నారు. “మాది వందేళ్ళ చరిత్ర, అపార పరిపాలనా అనుభవం. ఒక్క సంవత్సరం మంత్రులు కడుపు కట్టుకుంటే అన్ని హామీలు అమలయ్యేవి,” అని సూచించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు బజార్లో పెట్టారని ఆరోపిస్తూ, రాష్ట్ర మానాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాసికి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.