Minister Sridhar Babu: అందుకే సీఎం అలా మాట్లాడారు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు క్లారిటీ!
- ముఖ్యమంత్రి ముక్కు సూటి మనిషి..
- గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నాం
- బీజేపీ వాళ్లు దిగి పోండి అంటున్నారు..
- బీజేపీ కేంద్రం లో పాలన చేతకాకపోతే దిగమను
- పెహల్గం వైఫల్యం కి దిగి పో అనాలా..?
- బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..?
- మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి ముక్కు సూటి మనిషి అని.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియాతో మంత్రి చీట్‌చాట్ నిర్వహించారు. బీజేపీ వాళ్లు దిగి పోండి అంటున్నారు.. బీజేపీ కేంద్రం లో పాలన చేతకాకపోతే దిగమను.పెహల్గం వైఫల్యంకి దిగి పో అనాలా..? బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..? మోడీ విదేశాలకు పోతే.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఒకరిద్దరు బెదిరించినట్టు మాట్లాడారు .. దానికి హార్ట్ అయ్యి ఉంటారన్నారు. హెలికాప్టర్ ప్రభుత్వం అద్దెకు తీసుకుందని.. మంత్రులు జిల్లాలు తిరిగితే… కార్ల కంటే హెలికాప్టర్ ఖర్చు తక్కువన్నారు. ఇప్పుడున్న హెలికాప్టర్ గత ప్రభుత్వం హయంలోనే అద్దెకు తీసుకున్నారని. వాళ్లు తిరగకుండా రెంట్ కట్టారని చెప్పారు… తాము వాడుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
సీఎం ఆవేదనతో మాట్లాడటానికి గల కారణాన్ని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. “ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి మాట్లాడారు సీఎం. చిన్నాభిన్నం చేసిన ఆర్ధిక విధానం చూసి ఆవేదనతో మాట్లాడారు. నేను ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేయాలి … డబ్బులు లేవు అనే ఆవేదన సీఎం లో ఉంది. బీఆర్ఎస్ వాళ్లకు పేగు బంధం ఉంటే… జీతాలే సరిగా వేయలేదు. వాళ్లకు ప్రేమ ఉన్నట్టా..? మేం రాగానే డీఏ ఇచ్చాం. వాళ్ళలాగా మేము వదిలేయలేదు. కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పులు కూడా ప్రభుత్వమే కడుతుంది. కేటీఆర్.. ప్రభుత్వం చేసిన అప్పుల గురించే మాట్లాడుతున్నారు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Kedarnath Dham: కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో డీజే మ్యూజిక్, డ్యాన్స్.. కేసు నమోదు..
రాష్ట్రాన్ని దివాళా తీయించింది కేసీఆర్ అని.. దాని నుంచి బయట పడేసే పని మేము చేస్తున్నామని శ్రీధర్ బాబు అన్నారు. “సెక్రటేరియట్ హోం ఐతే.. వాళ్ళు ఉండేది ఫార్మ్ హౌసా..? ఉద్యోగస్తులు మా సోదరులు.. మా మిత్రులే. ఆలస్యం అయినా.. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. తెలంగాణ లోనే కాదు..దేశ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అయినా.. వనరులు పెంచి.. నిధులు తెచ్చే పనిలో ఉన్నాం. లక్ష కోట్లు తెచ్చు కాళేశ్వరంలోనే పెట్టారు కేసీఆర్. సీఎం…ఈ వ్యవస్థ గురించి ప్రజలకు తెలియాలి అని చెప్పారు. అప్పులు.. చెప్పకపోతే ప్రజలకు తెలియాలి కదా. రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్ ఇవ్వలేక.. కేసీఆర్ ఉద్యోగుల పదవి కాలాన్ని పెంచారు. కానీ మేము యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం.” అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మవోయిస్టుల ఎన్‌కౌంటర్లపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. మావోయిస్టుల తో మా కుటుంబానికి అన్యాయం జరిగింది. కానీ ఇంకో కుటుంబానికి అన్యాయం జరగొద్దు అనేది మా ఆలోచన. శాంతి చర్చలు కోరడం తప్పు కాదు. మా ప్రభుత్వమే గతంలో మావోయిస్టుల తో చర్చ చేసిందని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?