CM Revanth Reddy : ఇవాళ్టి ప్రత్యేక ఘట్టంగా సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించటంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 136 ఏళ్లకు పైగా తెలంగాణ సింగరేణి తన బొగ్గు తవ్వకాలను నిర్వహించి రాష్ట్రానికి వెలుగులు పంచుతుంటే, ఇప్పుడు ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్లో తవ్వకాలు ప్రారంభించడం ద్వారా సింగరేణి సంస్థ భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుంది అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్…
KTR: సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి హృదయపూర్వకంగా స్వాగతం తెలిపింది. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొనింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయమని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం అంటూ పేర్కొన్నారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం…
Revanth Reddy: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ పెట్టుబడులు అవసరమన్న దృక్పథంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలు ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు నేడు వెళ్లనుంది. నేటి (ఏప్రిల్ 16) నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా నగరాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో…
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని భూములు, మద్యం అమ్మకాలతో నడిపించాలనే తపనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, “ఇంట్లో చెట్టు కాటానికే జీహెచ్ఎంసీ అనుమతి అవసరం అయితే, హెచ్సీయూలో ఉన్న చెట్లను ఎవరి అనుమతితో నరికి వేశారు?” అంటూ ప్రశ్నించారు. కన్జర్వేషన్ యాక్ట్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల అమ్మకాలే…
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల కలను సాకారం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం 12 మంది లబ్ధిదారులకు లాంఛనంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రూ. 20.19 కోట్లను 2,019 మంది లబ్ధిదారులకు విడుదల చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద…
CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. ఇటీవల ఎంపీ చామల, రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ వస్తున్న వ్యాఖ్యలు పార్టీకి మంచి పేరు తీసుకురావని సీఎం హెచ్చరించారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, ఈ అంశంపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని రేవంత్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి,…
CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశం నేడు (మంగళవారం) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లే దిశగా చర్చలు సాగనున్నాయి. గాంధీభవన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.., జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రంలోని మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండి ప్రభుత్వ పథకాలను వివరించేందుకు…
CLP Meeting: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకున్న సందర్భంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం (CLP) కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది. ఈ సమావేశం రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ శాసనపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక ప్రజాహిత పథకాలపై సమీక్ష జరుగనుంది. Read Also: Anna Lezhneva: అన్నదాన…
Telangana SC Classification: తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. మూడు గ్రూపులుగా విభజన, రిజర్వేషన్ల కేటాయింపు…
SC Categorization: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ వర్గీకరణ అమలుకు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఎంపిక చేసుకోవడం విశేషం. గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ప్రతిఫలంగా, ఈ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో…