గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం అయినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఆ సభకు 2 లక్షల మంది వరకు వచ్చినట్టు లెక్కలు వేస్తున్నారు.. అయితే, దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 8 ఎకరాల్లో 2 లక్షల మంది ఎలా పడతారు?…
ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అవసరం అయితే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. తెలంగాణ భవన్లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. మేం ప్రభుత్వoలో ఉన్నాం.. చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. కానీ, ప్రతిపక్షాలకు పని లేదు.. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు.. ఒకరేమో నేనున్నాని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జన సంఘ్ ఉందా..? అని ప్రశ్నించారు కేటీఆర్.. చరిత్రకు మతం…
సీఎం కెసిఆర్ తాగు బోతులకు… కేటీఆర్ డ్రగ్స్ వాడే వాళ్లకు అంబాసిడర్ అని.. డ్రగ్స్ కేసులో పిలుస్తున్న హీరో లకు డ్రామా రావు దోస్తు కాదా ? అని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇవాళ దళిత గిరిజన దండోరా సభలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సన్నాసులు గజ్వెల్ రండి చూసుకుందాం అన్నారని… 2 లక్షలు మంది కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వెల్ గడ్డ మీద కదం తొక్కారన్నారు. స్వేచ్ఛ,…
దూకుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి పెట్టింది పేరు. ఆ వ్యక్తిత్వమే ఆయన్ను రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టింది. కాంగ్రెస్ లో ఎంతమంది హేమాహేమీలున్నా వారందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ అతడికి టీపీసీసీ కట్టబెట్టింది. ప్రజల్లో ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఉంది. అయితే ఈ దూకుడే ప్రస్తుతం ఆయన కొంప ముంచేటట్లు కన్పిస్తుంది. ముందువెనుక చూసుకోకుండా ఆయన సొంత పార్టీ నేతపై చేసిన విమర్శలు ఆయనకు…
కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. గాంధీ భవన్లో జెండా ఎగరేసిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి అప్పటి ప్రధాని నెహ్రూ సహకరించారని తెలిపారు.. హోంమంత్రికి ప్రత్యేక నిర్ణయాలు ఉండవు.. ఆపరేషన్ పోలో నిర్ణయం నెహ్రూదేనని స్పష్టం చేశారు.. కానీ, కొందరు ఇది హోం మంత్రి నిర్ణయంగా చిత్రీకరిస్తున్నారన్న ఆయన.. కాంగ్రెస్ పూర్వీకుల…
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దొంగ ఒక పార్టీని లీడ్ చేస్తున్నారని, టీపీసీసీ ‘చీప్ ‘ రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ…
తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ కు గజ్వేల్ సిద్దమైంది. ఇప్పటికే ఇంద్రవెళ్లి, రావిర్యాలలో దళితుల సమస్యలపై సభలు నిర్వహించిన కాంగ్రెస్.. సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని… గజ్వేల్ లో సభ ఏర్పాటు చేస్తోంది. లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్. పిసిసి లో కొంత మంది నాయకులు .. గజ్వేల్ లో సభ ఎందుకు… హుజురాబాద్ లో పెడితే ఎన్నికలకు అక్కరకు వస్తుందని పార్టీ నేతలు సూచించారు. అయితే… గజ్వేల్‌లో సభ…
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చేసింది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దళిత, గిరిజన దండోరా పేరుతో పలు జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇదే ఊపులో ఆయన టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రలు లోపించాయని.. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్…
తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్ మొదలైంది. అదేరోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ సభలకు రెడీ అవుతున్నాయి. విమోచన దినం పేరుతో కమలనాథులు.. ఆత్మగౌరవ సభ పేరుతో గజ్వేల్‌లో కాంగ్రెస్ ఫోకస్పెట్టాయి. మరి.. టీఆర్ఎస్ ఆలోచన ఏంటి? అధికారపార్టీ ఏం చేయబోతోంది? తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడి! ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుంది అంటే తెలంగాణలో పొలిటికల్‌గా హాట్ హాట్ చర్చ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.…
తెలంగాణ కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇక ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అనుకుంటున్న తరుణలో ఆ ప్లేసును కాంగ్రెస్ భర్తీ చేస్తుందని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికకు వచ్చేసరికి కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇక్కడి ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా టీఆర్ఎస్, బీజేపీలు తమ…