ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ధ భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులంటా దిల్షుఖ్ నగర్ రావాలని, దిల్షుఖ్ నగర్ లో సాయంత్రం 4 గంటల నుంచి ఎలాగైనా ర్యాలీని చెపట్టితీరుతామని రేవంత్ ప్రకటించారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. కట్టుదిట్టమైన…
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపగా.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి… గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ సారి 60 వేల ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ…
నిరుద్యోగ సమస్య పై ఆందోళన బాట పట్టాలని టి-కాంగ్రెస్ నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు సిద్దమైంది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే అక్టోబర్ 2 నుండి.. డిసెంబర్ 9 వరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీలకు అతీతంగా… నిరుద్యోగ సైరన్ కి మద్దతు పలకాలని అప్పీల్ చేస్తోంది పీసీసీ. అక్టోబర్ 2న దిల్సుఖ్నగర్ నుండి.. ఎల్బీ నగర్లో శ్రీకాంత చారి ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం వరకు ర్యాలీ చేయాలని…
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తుఫాన్, భారీ వర్షాల వరదల నష్టాల అంచనాలకు నియోజక వర్గాలకు ఐఏఎస్ అధికారులను పంపించండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పల్లెలు పట్టణాలు, నగరాలు అతులాకుతలం అవుతున్నాయి. రాష్ట్రంలో పంటలు, ఇళ్ళు, రోడ్లు, చెరువులు, కాలువలు నష్టాలకు గురవుతున్నాయి. భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయి, ఇళ్లు కూలిపోయి ప్రాణ…
కొత్త పీసీసీ చీఫ్, కొత్త కమిటీలను నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అలా అనీ మొత్తం కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు.. ఆయన నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, పార్టీ సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటున్నారు. ఇక, అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాను…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్‌ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. అయితే, ఈ ఎపిసోడ్ ఇవాళ్టితో ముగిసిపోయిందని.. మళ్లీ రిపీట్ కాదని ప్రకటించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో సమావేశమైన వివరణ ఇచ్చారు జగ్గారెడ్డి.. నిన్నటి వ్యవహారంపై కార్యదర్శులు ఆయనతో మాట్లాడారు.. తను వ్యాఖ్యలు చేయడానికి కారణాలను పార్టీ నేతలకు ఏకరువు పెట్టారు.. ఇక, అనంతరం మీడియాతో…
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో రేవంత్‌కు సీనియర్లకు అస్సలు పడటం లేదు. ఎవరి గోల వారిదేనా? రాహుల్‌ను విమర్శించినా పార్టీ నేతల నుంచి స్పందన లేదా? నేతల మధ్య స్పష్టమైన విభజన వచ్చేసిందా? రేవంత్ వర్గం తప్ప ఇంకెవరూ మాట్లాడం లేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మీదకు రావాలంటే బ్రహ్మాండం బద్ధలవ్వాలనే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒకప్పుడు పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉన్నా.. ఆయనతో తమకు పడకపోయినా.. సోనియా, రాహుల్ గాంధీలను…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం అధిష్టానం ఎంత సమయం తీసుకుందో అందరికీ తెల్సిందే. పార్టీలోని అందరూ సీనియర్ల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే తొలి నుంచి రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియర్ల నుంచి సవాళ్లు ఎదురవుతూనే వస్తున్నాయి. వీటన్నింటిని రేవంత్ ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే రోజురోజుకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లంతా గళం విప్పుతుండటంతో పార్టీ పరిస్థితి…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది.. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.. అంతే కాదు.. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో జగ్గారెడ్డి కామెంట్లపై సీరియస్‌గా చర్చించాలని రాష్ట్ర నేతలను మాణిక్యం ఠాకూర్ ఆదేశించినట్టు తెలుస్తుంది… ఏఐసీసీ కార్యదర్శి బోస్…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ పార్టీలో తాజాగా జరుగుతున్న కొన్న ఘటనలపై స్పందించిన జగ్గారెడ్డి… పార్టీ బాగు కోసమే నేను మాట్లాడుతున్న.. రేవంత్ ఒక్కడితో అంతా అయిపోదన్నారు.. అందరినీ కలుపుకుని పోవాలని సూచించిన ఆయన.. రేవంత్ తీరుపై సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. నేను మాట్లాడేది తప్పు అయితే.. రేవంత్‌రెడ్డి చేసేది కూడా తప్పే అంటున్నారు జగ్గారెడ్డి. ప్రతీ సభలో ఎవ్వరినీ ఆయన…