మాకు అది చెప్పలేదు.. ఇది చెప్పలేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఇలాంటి పంచాయితీలు ఏవో ఒకటి కామన్. చీమ చిటుక్కుమన్నా హైకమాండ్‌కు వెంటనే ఫిర్యాదు చేసేస్తారు. పేచీలకు అదీ ఇదీ అనే విభజన రేఖ ఏదీ ఉండదు. ప్రస్తుతం అలాంటి ఒక అంశమే పార్టీలో చర్చగా మారింది. గాంధీభవన్‌లో జరిగిన మీటింగ్‌పై కాంగ్రెస్ సీనియర్లు గుర్రు కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఉద్యమిస్తోన్న వామపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… కేసీఆర్, మోడీ సర్కార్ లపై నిప్పులు చెరిగారు. ఇవాళ అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, మోడీ ఇద్దరూ తోడు దొంగలేనని… పెట్రోలు, డీజిల్ ధరలు అడ్డుగోలుగా పెరిగాయని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ ఆస్తులు అమ్ముతున్నారని… నోట్ల రద్దు పేదల పాలిట విష ప్రయోగమన్నారు. మోదీ జాతి సంపదను ఆధాని, అంబానీలకు అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. ఆధాని,…
రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు దూకుడుగా రాజకీయాలు చేస్తుంటే.. మరికొందరు నెమ్మదిగా వెళుతుంటారు. ఏదిఏమైనా అల్టిమేట్ గా వాళ్ల గోల్ మాత్రం అందలం ఎక్కి ప్రజాసేవ చేయడమే. సరైన వ్యూహాలతో ముందుకెళితే రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ ఉంటుంది. లేనట్లయితే అనతికాలంలోనే కనుమరుగు కావాల్సి ఉంటుంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు మారాలంటే చాలా ఆలోచించే వాళ్లు. ఇప్పుడైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి జంపింగ్ లు కామన్ అయిపోయింది. దీన్ని ప్రజలు లైట్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బండి సంజయ్‌ది పాదయాత్ర కాదు విహారయాత్ర అని ఎద్దేవా చేశారు.. కాళేశ్వరం ఫలితాలను సంజయ్ చూస్తున్నారని.. పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పడం లేదన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వ పథకాలతో సంతోషంగా ఉన్నామని బండి సంజయ్ కి ప్రజలే చెబుతున్నారని.. ఇకనైనా కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలని…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసుపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు… రేవంత్‌రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది… పరువు నష్టం కేసులో ఇంజెక్షన్ ఆర్డర్‌పై వాదనలు ముగిశాయి.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు కేటీఆర్.. అయితే, మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది కోర్టు.. కాగా, తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పరువునష్టం దావా వేశారు.. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ పూర్తి అయ్యింది.. ఈ కేసులో విచారణ పూర్తిచేసిన సిటీ సివిల్ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.. కాగా, రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులతో మంత్రి కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయని.. అలాగే డ్రగ్స్‌కు కేటీఆర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారంటూ…
రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ లో భాగంగా… ఇవాళ గన్ పార్క్ కు వచ్చారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ఆదర్శం గా ఉంటుందని… కేటీఆర్ ముందుకు వస్తే ఆయన స్థాయి మరింత పెరిగేదని అభిప్రాయ పడ్డారు.రాజకీయ నాయకుడు స్థాయి గురించి మాట్లాడితే .. కేటీఆర్ పతనం మొదలైనట్లేనన్నారు. ”ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన సవాల్ ను.. నీ స్థాయి..నా స్థాయి అని అనడం అంటేనే…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ను స్వీకరించకుండా…. మంత్రి కేటీఆర్ పారిపోయాడని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డీ ఛాలెంజ్ లో ముందుకు వచ్చారని.. కానీ కేటీఆర్ మాత్రం రాలేదన్నారు. విశ్వనియత నిరూపించుకోవాలి అంటే… కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కి రావాల్సిందేనని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ. 14 యేండ్ల పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని అకున్ సబర్వాల్ నివేదిక చెప్పిందని…గుర్తు చేశారు.…
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యం లో… తెలంగాణ మంత్రి కేటీఆర్ మరియు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. డ్రగ్స్ టెస్టు లకు నువ్వు సిద్దామా ? అంటే నువ్వు సిద్దామా ? అన్న రీతిలో ఇద్దరూ లీడర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యం లో తాను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. టెస్ట్ కోసం రాహుల్ గాంధీ వస్తే తాను…
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్ విసిరారు. తాను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. టెస్ట్ కోసం రాహుల్ గాంధీ వస్తే తాను కూడా రెడీ అని స్పష్టం చేశారు. చర్లపల్లి జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ గాంధీని ఒప్పించాలని… రేవంత్ రెడ్డికి చురకలంటించారు. తాను పరీక్ష చేయించుకుని క్లీన్ చిట్ తో వస్తే… రేవంత్ రెడ్డి.. తన పదవి నుంచి వైదొలుగుతానని అని…