Revanth Reddy:’మన మునుగోడు, మన కాంగ్రెస్’ పోస్టర్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. రేపు మునుగోడులో పాదయాత్రకు వెళ్లనున్నారు. ఒకే రోజు 6 మండలాల్లో పాదయాత్రకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. మన మునుగోడు, మన కాంగ్రెస్ పోస్టర్, స్టిక్కర్ విడుదల చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. రేపు 20వ తేదీన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో 176 గ్రామాలలో జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఆగ్రామాలలో కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి, రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నేతలు నివాళులు అర్పించనున్నారు. మన మునుగోడు, మన కాంగ్రెస్ పోస్టర్, స్టిక్కర్ ను ట్వీటర్ వేదకగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.
ఆగస్టు 13న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు గతంలో రెండు సార్లు కరోనా బారిన పడిన టీపీసీసీ చీఫ్ కు మరో కోవిడ్ సోకింది. అయితే నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాదయాత్రని చేపట్టింది. నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున్న ఈ పాదయాత్ర వాస్తవానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రారంభంకావాల్సింది. ఈనేపథ్యంలో.. ఇలాంటి కీలక తరుణంలో రేవంత్ రెడ్డి కరోనా బారిన పడటంతో అదికాస్త వాయిదాపడిన విషయం తెలిసిందే.
ఈ నెల 21న మునుగోడు ఉప ఎన్నిక కోసం అమిత్ షా రంగంలోకి దిగడానికి ముందుగానే, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారనే చర్చతో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్ మునుగోడు ఉప ఎన్నికను ఎంతో సీరియస్‌గా తీసుకుంది. అక్కడ బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని చర్యలు చేపట్టింది. దీంతో అమిత్ షా సభ కంటే ముందుగానే మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పాట్లు షురూ చేసింది. మునుగోడులో ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
ఈనేపథ్యంలో.. టీపీసీసీ రేవంత్ రెడ్డి రేపు మునుగోడులో పాద్ర నిర్వహించనున్నారు అనే వార్త చర్చకు దారితీస్తోంది. టీఆర్‌ఎస్ రేపు భారీ బహిరంగ సభ, రేవంత్ రెడ్డి పాద యాత్రపై ఉత్కంఠ నెలకొంది.
Arvind Kejriwal: సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం