సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే, జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాన్నాళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వసితులను పోలీసులు వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళ్తున్న కొందరిపై లాఠీచార్జ్…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరిని చేర్చుకోవాలి? ఎవరికి నో చెప్పాలి అనేదానిపై క్లారిటీ ఇచ్చేందుకు కమిటీ వేసింది పార్టీ. సీనియర్ నేత జానారెడ్డి ఆ చేరికల కమిటీకి ఛైర్మన్. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరతానని ముందుకొస్తే.. కమిటీలో చర్చించి.. స్థానిక నాయకత్వంతో మాట్లాడతారు. ఏ మూహూర్తాన జనారెడ్డి కమిటీని వేశారో కానీ.. కాంగ్రెస్‌లో చేరుతున్న వారి గురించి ఆ కమిటీకి సమచారమే లేదు. చర్చల్లేవ్.. చర్చించడాలు లేవు. ప్రస్తుతం ఇదే పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. మంచిర్యాల నుంచి TRS…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రేపు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకువచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవిమానపరిస్తూ సైన్యంలో కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లాగా చేస్తోందని ఆయన మండిపడ్డారు. యువతను నిర్వీర్యం…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు పిచ్చి చేష్టలే నన్ను మంత్రిని చేసిందని, ఇప్పడు కేసీఆర్ చేష్టలతో కాంగ్రెస్…
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభం అయ్యాయా? ఓ మాజీ నేత కూతురు టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో కార్పోరేటర్ గా ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా వున్నారు. ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో విజయా రెడ్డి భేటీ అయ్యారు. తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికల వేళ విజయా రెడ్డి డిప్యూటీ మేయర్…
సికింద్రాబాద్ ఆందోళనల్లో మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్ఎస్ జెండా కప్పి చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ వేదికగా మండిపడింది. ఆ వీరుడి అంతిమ యాత్రలో ఉండాల్సింది, భారత త్రివర్ణ పతాకమని.. ఫాసిస్టు పింకు జండాలు కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ విద్యార్థి చావు ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాబందులు శవాల మీద వాలి పీక్కు తినడం తెరాస నాయకులను చూసే నేర్చుకున్నాయేమో…
రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఘట్కేసర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. మరోవైపు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి.. పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు రోజు…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. కాగా ఘట్కేసర్లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని రేవంత్ నిలదీశారు. అరెస్ట్ గురించి రాతపూర్వకంగా పత్రం ఇస్తేనే పోలీస్‌స్టేషన్‌కు వస్తానంటూ రేవంత్…