Robin Uthappa: టీమిండియాకు మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఈశ్వర్ పాండే రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇండియా, కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 20 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఉతప్ప భారత్ తరపున 46 వన్డేలు, 13 టీ20లు…
New Zealand: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ (36) బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌కు ఇన్నాళ్లపాటు ఆడే అవకాశం లభించడం తన అదృష్టమని గ్రాండ్‌హోమ్ చెప్పాడు. వయసు పెరిగిన తన శరీరానికి శిక్షణ తీసుకోవడం కష్టమవుతుందని.. గాయాలు వేధిస్తున్నాయని అందువల్ల తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. జింబాబ్వేలో పుట్టిన గ్రాండ్ హోమ్ 2004లో అండర్-19 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే తరఫున ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌కు మకాం మార్చి…
ICC Posted Dhoni Video: టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు పూర్తవుతోంది. 2020, ఆగస్టు 15న ధోనీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోనీ రిటైర్మెంట్‌కు రెండేళ్లు పూర్తి కావడంతో ఐసీసీ ప్రత్యేక నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ధోనీకి సంబంధించిన కొన్ని చిరస్మరణీయ స్మృతులను చూపించింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్,…
ravi shastri sensational comments on hardik pandya: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల అనూహ్య రీతిలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కూడా వన్డేలకు గుడ్‌బై చెప్తాడని మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డేల నుంచి హార్డిక్ పాండ్యా తప్పుకునే అవకాశం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. పాండ్యా వన్డేలను…
Ben Stokes Retirement to ODI Cricket: ఇంగ్లండ్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ షాకిచ్చాడు. అనూహ్యంగా వన్డేల నుంచి తాను తప్పుకుంటున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డే తనకు చివరిదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ స్టోక్స్ సొంత మైదానం డర్హామ్‌లో జరగనుంది. అయితే ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బెన్ స్టోక్స్ వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన తోటి…
2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు తన రిటైర్మెంట్‌పై మోర్గాన్ ప్రకటన చేసే అవకాశముంది. త్వరలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని మోర్గాన్ తొలుత భావించినా ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకోవడానికే అతడు ప్రయత్నిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటం, పేలవ ఫామ్ వంటి అంశాల కారణంగా మోర్గాన్ ఈ…
ఇప్పటివరకు రుమేలీ ధర్ ఇండియా తరఫున 78 వన్డేలు ఆడి 961 పరుగులు చేసింది. అటు 18 టీ20లు ఆడి 131 పరుగులు సాధించింది. టెస్ట్ కెరీర్‌లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. నాలుగు టెస్టుల్లో రుమేలీ ధర్ 236 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొంది. దాదాపు 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు నెట్ యూజర్లు అంతా గూగుల్ క్రోమ్, యాపిల్ సఫారీకి అలవాటు పడడంతో.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు మార్కెట్ తగ్గింది. ఇక విండోస్ 10 నుంచి ఎక్స్‌ప్లోరర్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుందని, భద్రతా ప్రమాణాలు కూడా ఎక్కువని,…
టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. 23 ఏళ్ల పాటు క్రికెట్‌ను ఆస్వాదించానని, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నానని మిథాలీరాజ్ వివరించింది. దీనికి అందరి ఆశీర్వాదాలు కావాలని ఆకాంక్షించింది. అనేక మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన తాను భవిష్యత్తులో మహిళా క్రికెట్ వృద్ధికి తోడ్పాటును అందిస్తానని మిథాలీరాజ్ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన మిథాలీరాజ్ ప్రపంచ మహిళా క్రికెట్‌లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఘనతను సొంతం…