Rumeli Dhar: రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా మహిళా క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాకు చెందిన మరో మహిళా క్రికెటర్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా వెటరన్ ఆల్‌రౌండర్ రుమేలీ ధర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. 38 ఏళ్ల రుమేలీ 2003లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఆమె ఇండియా తరఫున 78 వన్డేలు ఆడి 961 పరుగులు చేసింది. అటు 18 టీ20లు ఆడి 131 పరుగులు సాధించింది. టెస్ట్ కెరీర్‌లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. నాలుగు టెస్టుల్లో రుమేలీ ధర్ 236 పరుగులు చేసింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 84 వికెట్లు పడగొట్టింది. 2005 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో రుమేలీ ధర్ కీలకపాత్ర పోషించింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని రుమేలీ ధర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ’23 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని శ్యామ్‌నగర్‌లో ప్రారంభమైన నా క్రికెట్ కెరీర్ నేటితో ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఇక 2005 నా కెరీర్‌లో మరిచిపోలేని సంవత్సరం. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ చేరడం.. అందులో నేను భాగస్వామ్యం అవడం ఎప్పటికి మరిచిపోలేను. మెన్ ఇన్ బ్లూ డ్రెస్‌లో కప్ కొట్టలేదన్న వెలితి తప్ప మిగతా అంతా సంతోషంగానే అనిపించింది. ఆ తర్వాత గాయాలు తరచూ వేధించినప్పటికి తిరిగి ఫుంజుకుని టీమిండియాకు ఆడాను. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందుకే రిటైర్మెంట్‌కు ఇదే కరెక్ట్ అని భావించాను. ఇంతకాలం నాకు సహకరించిన కుటుంబ సభ్యులకు, బీసీసీఐ, నా స్నేహితులకు కృతజ్ఞతలు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో నేను ప్రాతినిధ్యం వహించిన అన్ని జట్లకు నా తరపున మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా’ అంటూ రుమేలీ ధర్ పోస్ట్ చేసింది.
Also Read
- Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
- Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
- Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
Team India: టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!