2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతటి గొప్ప విజయం సాధించిన భారత జట్టులోని ఆటగాళ్లలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కడే క్రికెట్‌లో కొనసాగుతుండటం గమనార్హం. మిగతా క్రికెటర్లందరూ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇటీవల శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం ప్రపంచకప్ విన్నింగ్ టీమ్‌లో కోహ్లీ ఒక్కడే మిగిలాడు.…
స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా మీర్జా మాట్లాడుతూ… ఇదే తన చివరి సీజన్ అని నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన సానియా మీర్జా ఇదే తన చివరి సీజన్ అని చెప్పింది. తన ఆటతీరుతో ఎన్నో టైటిళ్లను సాధించడంతో పాటు ప్రశంసలు…
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెట్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల మోరిస్ 12 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. మూడు ఫార్మాట్లలో సఫారీ జట్టు తరఫున 69 మ్యాచ్‌లు ఆడిన మోరిస్ బౌలింగ్‌లో 94 వికెట్లు పడగొట్టాడు. 2012 డిసెంబర్‌లో టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. తర్వాత ఏడాది వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు టెస్టు అరంగ్రేటం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది.…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు…
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. శ్రీలంక బోర్డు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. Read Also: కోహ్లీ వందో టెస్టుపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే శ్రీలంక బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిట్‌నెస్ మార్గదర్శకాల…
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది… జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఉన్న హఫీజ్.. రిటైర్మెంట్ ప్రకటించారు.. ఆయన వయస్సు 41 ఏళ్లు.. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగట్రేం చేసిన మహ్మద్ హఫీజ్.. ఆల్‌రౌండర్ షోతో.. పాకిస్థాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.. ఇక, 2018లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌చెప్పిన ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల పాటు పాక్ జట్టుకు…
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కాసేపటి క్రితమే ఈ ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.…
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌తో తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన అతడు.. ఎక్కువకాలం టెస్టుల్లో కొనసాగేందుకు సిద్ధంగా లేనని ఆ సమయంలోనే బోర్డుకు సూచించాడు. దీంతో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్‌లో 50 టెస్టులు ఆడిన మహ్మదుల్లా 33.11…
దక్షిణాఫ్రికా ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు ఏబీ డివిలియర్స్. ఇక తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. తన వయస్సు పై బడిందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు ఏబీడీ. ”ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పెరట్ల మా అన్నయ్యలతో మ్యాచ్…
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ-20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్లో ఎన్నో హెచ్చుతగ్గులు చూశానని, ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కాస్త బావోద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్ల పాటు వెస్టిండీస్ తరపున ప్రాతినిధ్యం వహించాడు బ్రావో. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా… లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అటు వెస్టిండీస్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తన కెరీర్‌కు…