సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి బలహీనపడుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా వెళ్లిపోవడం పార్టీని కలవరపెడుతోంది.
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 83 ఏళ్ల బన్వరీలాల్.. వ్యక్తిగత కారణాల చేత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజ్ముల్ హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెందిన ఆమె శుక్రవారం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని.. జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని.. అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించింది అని సుమిత్రానంద్ అన్నారు. ఉద్యోగ నామ…
కేసీఆర్ సర్కార్ తో ప్రయాణం చేసిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తమ పోస్టులకు రిజైన్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రీజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తుంది. దీంతో పీసీబీలో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి తాడిమళ్ల బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గౌతమి తాడిమళ్ల లేఖ ద్వారా తెలియజేశారు
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. వారం పది రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు.