ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రుల అరెస్ట్‌లను పర్యవేక్షించిన ఐఆర్ఎస్ అధికారి కపిల్ రాజ్ తన సర్వీస్‌కు గుడ్‌బై చెప్పారు. 16 సంవత్సరాలు సర్వీసు తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (62) శనివారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ట్వీట్ చేశారు.
రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా (72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కేబినెట్ పదవిని త్యాగం చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లాల్ మీనా సవాల్ విసిరారు.
రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని తెలిపారు. నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు. ఇవాళ సాయంత్రం గవర్నరును కలిసి రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలో.. గవర్నర్ సవాంగ్ రాజీనామాను ఆమోదించారు. కాగా.. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని సవాంగ్ పై ఆరోపణలు వచ్చాయి. సవాంగ్ వైసీపీ హయాంలో డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. అయితే.. సవాంగ్ పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సమయం…
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమబెంగాల్‌లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు.
బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం తన రాజీనామా చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే భూపేంద్ర సింగ్ ఈ చర్య తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి మహ్మద్ ఆరిఫ్ (నసీం) ఖాన్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్టార్ క్యాంపెయినర్ పదవికి ఆయన రాజీనామా చేశారు