బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజ్ముల్ హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన 12 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నజ్ముల్ హసన్ కూడా ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక, ఈసారి మళ్లీ ఎంపీగా ఎన్నికైన ఆయనకు యువజన, క్రీడల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. గురువారం నాడు ఆయన ఈ శాఖ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నజ్ముల్ ఇప్పుడు క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవిని విడిచిపెట్టారు.
Read Also: Guntur Kaaram: డే 1 కలెక్షన్స్… రీజనల్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ ఇండియా రికార్డ్
ఇక, నజ్ముల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. నేను రెండు పదవులను ఒకేసారి నిర్వహించగలిగాను.. ఈ రెండు విషయాలను కలిపి నిర్వహించకూడదని చట్టంలో లేదు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌కి క్రీడా మంత్రిత్వ శాఖ లభించడం వల్ల ఆ పదవిని వదులుకోవడంలో ఎలాంటి సంబంధం లేదన్నారు.. ఈ రెండు పదవులను ఏకకాలంలో నిర్వహించిన పలువురు మంత్రులు గతంలో కూడా ఉన్నారు అని ఆయన చెప్పారు. విదేశాల్లో కూడా ఇలాగే జరిగింది.. అయితే నేను ఈ రెండు పదవులు నిర్వహిస్తే క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాననే ఆరోపణలు వస్తాయి కాబట్టి.. బీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజ్మల్ ప్రకటించారు.
Read Also: Terrible Incident: భార్య ఆత్మహత్య.. భర్తను వెంబడించి చంపిన అమ్మాయి బంధువులు
అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డులో గవర్నింగ్ బాడీని ఎన్నుకుంటే దాని పదవీకాలం పూర్తి కావాలి.. దీని ప్రకారం, నజ్ముల్ అక్టోబర్ 2025 వరకు పదవిలో కొనసాగడం తప్పనిసరి.. దీంతో పాటు బోర్డు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అనే విషయం కూడా స్పష్టం చేయాలి.. అలాంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అంశంపై ఐసీసీతో చర్చిస్తుంది.